1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. The song Naa Kanupaape...from Jayanth and the Jingo Pen

Dil Raju Launch: జయంత్ అండ్ ది జింగో పెన్ నుంచి నా కనుపాపే.. సాంగ్

Jayanth and the Jingo Pen team with dil Raju
Jayanth and the Jingo Pen team with dil Raju
దివ్య ప్రవీణ్ బొలిశెట్టి నిర్మాణంలో  నవీన్ దేశబోయిన తెరకెక్కించిన చిత్రం ‘జయంత్ అండ్ ది జింగో పెన్’. ఈ సినిమాలో మాస్టర్ జయంత్ బొలిశెట్టి, మన శంకర వర ప్రసాద్ ఫేమ్ ఊహా రెడ్డి, సత్యం రాజేష్, ఆశిష్ గాంధీ, మానస రాధాకృష్ణన్, తనికెళ్ల భరణి, కాశీ విశ్వనాథ్, మానిక్ రెడ్డి, అశోక్ కుమార్, శ్రీకాంత్ రెడ్డి, తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. ఈ మూవీని బాలల దినోత్సవం సందర్భంగా నవంబర్ 14న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు.
 
 
ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రంలోని ‘నా కనుపాపే’ అంటూ సాగే ఎమోషనల్‌ సాంగ్‌ను రిలీజ్ చేశారు. సాంగ్ విడుదల చేసిన అనంతరం దిల్ రాజు చిత్రయూనిట్‌కి ఆల్ ది బెస్ట్ తెలిపారు. ప్రవీణ్ బొలిశెట్టి ఇచ్చిన బాణీ, సాహిత్యం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. మోహిత్ కులకర్ణి సంగీతం, చిన్మయి శ్రీపాద గాత్రం అందరినీ హత్తుకునేలా ఉంది. పిల్లలు, తల్లిదండ్రుల మధ్య ఉండాల్సిన బంధాన్ని ఎంతో చక్కగా ఈ పాటలో వివరించారు.
 
పిల్లలు, పేరెంట్స్, టీచర్స్ ఇలా అందరూ తప్పకుండా చూడాల్సిన చిత్రం. పిల్లలు, విద్యార్థుల్లో చూడాల్సింది మార్కులు కాదు.. వారి మనసులు అనే గొప్ప సందేశాన్ని ఇచ్చేలా ఈ సినిమాని రూపొందించారు. అందరిలోనూ స్పూర్తినింపేలా ఈ మూవీని తెరకెక్కించారు. బాలల దినోత్సవం సందర్భంగా ఈ సినిమాని నవంబర్ 14న భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.
About Writer
దేవీ
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
G.V. Prakash Kumar :ఆకాశంలో ఒక తార చిత్రానికి నేషనల్ అవార్డ్స్ వస్తుందని నమ్ముతున్నా : జీవీ ప్రకాశ్ కుమార్