1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
  4. Suryakumar Yadav enjoys desi mutton feast after Syed Mushtaq Ali heroics

స్నేహితుడి ఇంట్లో కింద కూర్చొని మటన్ కర్రీ - చపాతీలు ఆరగించిన సూర్యకుమార్

surya kumar
భారత స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ తన స్నేహితుడి ఇంట్లో చేసిన పనిని ప్రతి ఒక్కరూ ఎంతో మెచ్చుకుంటున్నారు. తన స్నేహితుడికి వెళ్లిన సూర్యకుమార్ కింద కూర్చొని మటన్ కర్రీ, చపాతీలను ఆరగించాడు. దీనికి సంబంధించిన వీడియో, ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 
 
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తుపాను ఇన్నింగ్స్ ఆడిన అనంతరం స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ ఓ స్నేహితుడి ఇంట నేలపై కూర్చొని మటన్ విందు ఆస్వాదించిన వైనం సోషల్ మీడియాలో విపరీతంగా ఆకట్టుకుంటోంది. కోల్‌కతా వేదికగా హైదరాబాద్‌పై ముంబై విజయం సాధించిన తర్వాత, సహచర ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్‌తో కలిసి సూర్య వేడివేడి రొట్టెలు, ఘుమఘుమలాడే మటన్ కర్రీ, రోటీలు తింటూ కనిపించాడు. 
 
మైదానంలో పరుగుల విధ్వంసం సృష్టించే ఈ స్టార్ ఆటగాళ్లు, ఒక సాదాసీదా గదిలో కింద కూర్చొని ఎంతో నిరాడంబరంగా భోజనం చేయడం అభిమానులను అమితంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా భోజనం అద్భుతంగా ఉందని, మాట్లాడటం కంటే తినడానికే మనసవుతోందని సర్ఫరాజ్ సరదాగా చెప్పిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
 
అంతకుముందు జరిగిన మ్యాచ్ ముంబై సారథి సూర్యకుమార్ యాదవ్ బ్యాట్‌తో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. హైదరాబాద్ నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కేవలం 21 బంతుల్లోనే 285.71 స్ట్రైక్ రేట్‌తో అజేయంగా 60 పరుగులు సాధించాడు. ఇందులోభాగంగా కేవలం 15 బంతుల్లోనే మెరుపు అర్ధశతకం బాది ఔరా అనిపించాడు. సూర్య మెరుపులతో ముంబై జట్టు కేవలం 13.1 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
న్యూజిలాండ్‌పై భారత్ సంచలన విజయం : ఏడేళ్ల తర్వాత వన్డే సిరీస్ కైవసం