1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Ramayana box office Day 13: Rs 1,483 crore haul, beats The Odyssey on IMDb

అనుమానాలతో మొదలై అద్భుత విజయం .. రూ.1483 కోట్లు వసూలు చేసిన 'రామాయణం '

ramayanam movie
బాలీవుడ్ దర్శుకుడు నితీశ్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, సాయిపల్లవి జంటగా, యశ్ ప్రతినాయకుడుగా నటించిన పాన్ ఇండియా మూవీ రామాయణం. ఈ చిత్రం విజయం అనుమానాలతో మొదలై ఇపుడు అద్భుత విజయాన్ని అందుకుంది. ఫలితంగా ఈ చిత్రం విడుదలైన 13 రోజుల్లోనే ఏకంగా రూ.1483 కోట్లు వసూలు చేసింది. ఒక్క బాలీవుడ్‌లోనే ఏకంగా రూ.600 ోట్లమేరకు వసూలు చేసినట్టు సమాచారం. 
 
ప్రముఖ ట్రేడ్ ట్రాకర్ 'శాక్ నిల్క్' వెల్లడించిన వివరాల మేరరకు.. ప్రస్తుతం ఈ చిత్రం రూ.1,500 కోట్ల మైలురాయికి చేరువలో ఉందని తెలిపింది. 13వ రోజైన నవంబరు 17వ తేదీన ఈ చిత్రం భారతదేశంలో రూ.28.70 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. 12వ రోజు వసూలైన రూ.32 కోట్లతో పోలిస్తే ఇది 10.3 శాతం తక్కువ. 
 
దీంతో ఇప్పటివరకు భారత్లో మొత్తం నెట్ వసూళ్లు రూ.821.30 కోట్లకు, గ్రాస్ వసూళ్లు రూ.981.50 కోట్లకు చేరాయి. ఇదే సమయంలో ఓవర్సీస్ మార్కెట్లలో రూ.502 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదయ్యాయి. ఈ చిత్రం సాధించిన మొత్తం వసూళ్లలో విదేశీ మార్కెట్ వాటా సుమారు 33.8 శాతంగా ఉండటం గమనార్హం.
 
దేశీయ వసూళ్లలో హిందీ వెర్షన్ కీలక పాత్ర పోషిస్తోంది. 13వ రోజున హిందీలో రూ.21 కోట్లు వసూలు కాగా, మలయాళంలో రూ.2.35 కోట్లు, కన్నడలో రూ.2.10 కోట్లు, తమిళంలో రూ.1.75 కోట్లు, తెలుగులో రూ.1.50 కోట్ల చొప్పున వసూలయ్యాయి.
 
కాగా, నవంబరు 5వ తేదీన విడుదలైన ఈ చిత్రం తొలి వారంలో (8 రోజుల్లో) భారత్‌లో రూ.564.60 కోట్ల నెట్ కలెక్షన్లను సాధించింది. రెండో వారంలోని పని దినాల్లో (వీక్ డేస్) వసూళ్లు కాస్త మందగించినప్పటికీ, ఓవర్సీస్‌లో మాత్రం తన జోరును కొనసాగిస్తోంది. ఇక ఐఎండీబీ పాపులారిటీ చార్ట్‌లోనూ ఈ సినిమా మూడో స్థానంలో నిలవడం విశేషం. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
చెప్పులు ధరించనని భీష్మ ప్రతిజ్ఞ చేసిన కోలీవుడ్ హీరో ఎవరు?