1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
  4. Met on Instagram..Raped a girl after inviting her to his flat A horrific incident in Vidisha, Madhya Pradesh

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. తన ఫ్లాట్‌కు పిలిచి బాలికపై అత్యాచారం

vidisha assault
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని విదిషాలో ఒక దారుణం జరిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఓ బాలికను తన ఫ్లాట్‌కు పిలిపించి అత్యాచారం చేసిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. బీఎస్సీ విద్యార్థి విశాల్ కిరార్ మూడు నెలల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో 16 ఏళ్ల బాలికను కలిశాడు. ఆ తర్వాత నవంబరు 14వ తేదీన విశాల్ ఆమెను తన ఫ్లాట్‌కు ఆహ్వానించాడు. ఆమె ఫ్లాట్‌కు రాగానే, విశాల్ ఆమెకు బీర్ తాగించి అత్యాచారం చేశాడు. 
 
ఆ బాలిక తీవ్ర రక్తస్రావానికి గురై, ఆమె ఆరోగ్యం క్షీణించింది.. విశాల్ ఆమెను ఫ్లాట్‌లో వదిలి పారిపోయాడు. ఒక వైద్య విద్యార్థి, మరో ఇద్దరు యువకులు.. బాధితురాలిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టి.. 48 గంటల్లోపే అతడిని అరెస్టు చేశారు. పోక్సో చట్టం, ఇతర సంబంధిత సెక్షన్ల కింద అధికారులు విశాల్‌పై కేసు నమోదు చేశారు. 

 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
సాక్షి కథనం.. జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే అంటోన్న వైఎస్ షర్మిల