1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Samantha Shares a Glimpse of Her New Chapter

డిసెంబరులో తల్లి కానున్న సమంత.. ప్రత్యేక పూజలో రాజ్, సమంత దంపతులు

Samantha
Samantha
టాలీవుడ్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు పంచుకున్న తాజా చిత్రాల్లో కుటుంబ అనుబంధం ప్రత్యేకంగా కనిపిస్తోంది. తమ మొదటి బిడ్డకు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్న తరుణంలో, సమంత, ఆమె భర్త రాజ్ నిడిమోరు ఒక సంప్రదాయ వేడుకలో పాల్గొన్నారు. ఈ వేడుకలో ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు పాల్గొని, దంపతులను ఆశీర్వదించారు.
 
ఎర్రని అనార్కలీ దుస్తుల్లో ఉన్న సమంత, పూజా కార్యక్రమాల సమయంలో రాజ్ పక్కన కూర్చుని కనిపించారు. ఒక చిత్రంలో పెద్దలు ఆమెను ఆశీర్వదిస్తుండగా, మరో చిత్రంలో ఆమె తన తల్లి నినెట్ ప్రభుతో, ఇరు కుటుంబాలకు చెందిన మహిళలతో కలిసి ఫోజులిచ్చారు. 
 
ఈ వేడుకలో రాజ్ కూడా పాల్గొనడంతో, ఇది కేవలం దంపతులకు మాత్రమే పరిమితం కాకుండా, ఒక కుటుంబ వేడుకగా మారింది. అయితే, సమంత ఇచ్చిన క్యాప్షన్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె కేవలం అస్ అని రాసి వైట్ హార్ట్ క్యాప్షన్, కుటుంబ చిత్రాలు పంచుకున్నారు. సమంత- రాజ్ తమ మొదటి బిడ్డ రాక కోసం ఎదురుచూస్తున్న తరుణంలో ఈ వేడుక జరిగింది. సమాచారం ప్రకారం, డిసెంబర్‌లో వారికి బిడ్డ జన్మించనుంది.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
అమెజాన్ ప్రైమ్‌లో ‘హ్యాపీ జర్నీ’.. ఐఎండీబీ, బుక్ మై షోలలోనూ రికార్డు రేటింగ్స్!