1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. ap cm chandrababu naidu review on akvan cyclone

అక్వాన్ తుఫానుపై సీఎం చంద్రబాబు సమీక్ష - కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి...

chandrababu
కోస్తాంధ్ర వైపు దూసుకొస్తున్న అక్వాన్ తుఫానుపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. తుఫాను గమనంపై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రస్తుతం అక్వాన్ తుఫాను గంటకు 3.కి.మీ వేగంతో కదులుతోందని.. ఈ సాయంత్రానికి తీవ్రతపై మరింత స్పష్టత వస్తుందని ఆర్టీజీఎస్‌ అధికారులు తెలిపారు. 
 
అయితే, ప్రకృతిలో విపత్తులు సహజమని, వీటిని చూసి భయపడాల్సిన పనిలేదని.. వాటి ప్రభావం ప్రజలపై పడకుండా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాలకు వాతావరణ హెచ్చరికలు పంపాలన్నారు. తమను ఆదుకోవడానికి ప్రభుత్వం, అధికారులు ఉన్నారనే భరోసా కల్పించాలన్నారు.
 
'ఇటీవల కాలంలో రాష్ట్రాన్ని మూడో తుఫాను తాకుతోంది. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సిబ్బంది ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు ఈ సమాచారం పంపాలి. చెట్లు, విద్యుత్‌ స్తంభాలు కూలినా వెంటనే క్లియర్‌ చేయాలి. ప్రభావిత ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలి. తుఫానుతో కురిసే భారీ వర్షాలకు చెరువులు, కాలువలకు గండ్లు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి' అని అధికారులను బాబు ఆదేశించారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
కేప్‌ టౌన్ ప్రజలకు వార్నింగ్ ఇచ్చిన ప్రకృతి.. ఏప్రిల్ 14, 2027 తర్వాత తాగు నీటి సరఫరా లేదు