1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Chandrayaan impresses with innovative entertainment : Hero Sree Vishnu

Sree Vishnu : కొత్తదనంతో కూడిన వినోదంతో చంద్రయాన్ ఆకట్టుకుంటుంది : హీరో శ్రీవిష్ణు

Sree Vishnu, Venu Udugula, Shiva Kumar Dheekonda and others
Sree Vishnu, Venu Udugula, Shiva Kumar Dheekonda and others
నిర్మాత వేణు ఊడుగుల తన సమర్పణలో "చంద్రయాన్" మూవీని తీసుకొస్తున్నారు. శివకుమార్ ధీకొండ, స్వప్న ప్రియదర్శిని, రవి శివతేజ, వంశీధర్, లోకేష్, బలగం సత్యనారాయణ కీలక పాత్రల్లో నటించారు. సింబ స్క్రీన్ స్టోరీస్ బ్యానర్ పై ప్రవీణ్ మొలక నిర్మిస్తున్నారు. శ్రీనాథ్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 13న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
 
హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ - ఏదైనా కొత్తదనం ఉంటే తప్ప వేణు ఊడుగుల గారు సినిమాను ప్రెజెంట్ చేయరు. ఈ సినిమా కాన్సెప్ట్ గురించి ఇప్పుడే చెప్పారు. ఇందులో ఒక సరదా పాయింట్ ఉంది. అందుకే వేణు గారు టేకప్ చేశారు. కొత్త టీమ్ ను సపోర్ట్ చేస్తున్న వేణు గారిని అభినందిస్తున్నా. ఈ సినిమా ఈ నెల 13న మీ ముందుకు వస్తోంది. మూవీ మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను. ఈ కొత్త టీమ్ అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నా. ఈ టీమ్ చేసిన ప్రయత్నాన్ని రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులతో పాటు ఇతర రాష్ట్రాల ఆడియెన్స్ కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నా. అన్నారు.
 
ప్రొడ్యూసర్ పూజారి నాగేశ్వరరావు మాట్లాడుతూ - మీ టెన్షన్ అన్నీ మర్చిపోయేలా చేసే చిత్రమిది. వేణు గారు ఎప్పుడైతే ప్రెజెంట్ చేస్తున్నారో అప్పుడే ఈ సినిమా సక్సెస్ అయినట్లు భావించాలి. ఈ నెల 13న చంద్రయాన్ రిలీజ్ కు వస్తోంది. ప్రేక్షకులంతా రెండు గంటల పాటు థియేటర్ లో ఈ సినిమాను ఎంజాయ్ చేయండి. అన్నారు.
 
ప్రొడ్యూసర్ బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ - వేణు మంచి సినిమాలు రూపొందించి దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన ముద్రవేసుకున్నాడు. రాజు వెడ్స్ రాంబాయి తర్వాత ఆయన అభిరుచి మరోసారి ప్రూవ్ అయ్యింది. చంద్రయాన్ సినిమా రిలీజ్ గురించి ఆయన నన్ను అప్రోచ్ అయ్యారు. సినిమా చూశాను చాలా బాగుంది. వరుసగా సినిమాలు రిలీజ్ అవుతూ థియేటర్స్ బిజీగా ఉన్నాయి. మేము అడగగానే ఈ చిత్రం కోసం ఎస్వీసీ నుంచి శిరీష్ గారు సపోర్ట్ చేశారు. నైజాం, వైజాగ్ చేస్తున్నారు. మిగతా డిస్ట్రిబ్యూటర్స్ అంతా ఈ సినిమాను ఎంకరేజ్ చేసేందుకు ముందుకొచ్చారు. మంచి ఎంటర్ టైనింగ్ సినిమా ఇది. ఈ సినిమా తప్పకుండా ప్రూవ్ చేసుకుంటుంది అని నమ్ముతున్నా. అన్నారు.
 
హీరో శివకుమార్ ధీకొండ మాట్లాడుతూ - ఈ వేదిక మీద హీరోగా నిలబడాలి అనేది నా పదేళ్ల కల. ఈ పదేళ్లలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. ఈ జర్నీలో చంద్రయాన్ వంటి మంచి అవకాశం రావడం హ్యాపీగా ఉంది. ఈ చిత్రంలో హీరోగా నన్ను సెలెక్ట్ చేసుకుని మా డైరెక్టర్ కు, నన్ను నమ్మి ప్రొడ్యూస్ చేసిన మా ప్రొడ్యూసర్ కు థ్యాంక్స్. ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమా చేయాలంటే ఈజీ కాదు. అందుకు మా టీమ్ అంతా చాలా సపోర్ట్ చేశారు. ఈ నెల 13న థియేటర్స్ లో మా సినిమా చూడండి. మీరు మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అంతా ఫుల్  ఫన్ ను ఎంజాయ్ చేస్తారు. అన్నారు.
 
డైరెక్టర్ శ్రీనాథ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ - ఈ సినిమాకు వర్క్ చేసిన ప్రతి టెక్నీషియన్, ఆర్టిస్ట్ కు రుణపడి ఉంటాను. 42 రోజులు షూటింగ్ చేశాం. సినిమా కోసం ప్రతి ఒక్కరూ చాలా కష్టపడ్డారు. శివకుమార్ ను ఈ సినిమాలో రాకెట్ మ్యాన్ గా చూపించాం. ఆయన ఫ్యూచర్ లో రాకెట్ స్టార్ గా ఎదుగుతారు. ఈ సినిమా కంప్లీట్ అయ్యాక వేణు గారి దగ్గరకు వెళ్లి కాన్సెప్ట్ చెప్పాం. ఆయనకు నచ్చి మాకు సపోర్ట్ గా ఉండేందుకు ముందుకొచ్చారు. ఈ నెల 13వ తేదీ నుంచి ప్రతి థియేటర్ లో నవ్వులు హంగామా మొదలవుతుంది. 2 గంటల 15 నిమిషాలు మిమ్మల్ని ఆగకుండా నవ్వించే చిత్రమిది.  ఆయుధాలు, రక్తపాతాలు లేని చిత్రమిది. మీ జీవితంలో ఏ సమస్య ఉన్నా మా మూవీ థియేటర్ కు రండి మీ బాధల్ని రెండు గంటల పాటు మర్చిపోయి నవ్వుకుంటారు. మా సినిమా మీకొక లాఫింగ్ థెరపీ.  ప్రతి సీన్ హిలేరియస్ గా నవ్విస్తుంది. అన్నారు.
 
వేణు ఊడుగుల మాట్లాడుతూ - మా సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. పెద్ద సినిమాలు ఉండటం వల్ల వాయిదా వేస్తూ వచ్చాం. ఒక్కసారి డేట్ మారితే ప్రొడ్యూసర్ కు ప్రమోషన్ కు చేసిన ఖర్చంతా భారమే. ఒక కాన్సెప్ట్ అనుకుని ఈవెంట్స్ చేస్తూ వచ్చాం. కానీ మా ప్రొడ్యూసర్ ఎంతో సపోర్ట్ చేశారు. సినిమా వాయిదా పడినా ప్రమోషన్ పరంగా వెనకడుగు వేయలేదు. రిలీజ్ విషయంలో బెక్కెం అన్న సపోర్ట్ చేశారు. మూవీ డిస్ట్రిబ్యూషన్ కు శిరీష్ గారు ముందుకొచ్చారు. మంచి థియేటర్స్ ఇద్దాం, సినిమా టాక్ బాగుంటే ఇంకా బెటర్ గా తీసుకెళ్దామన్నారు.  ప్రొడ్యూసర్ ఈ సినిమా మీద పెట్టుకున్న నమ్మకం గెలవాలని కోరుకుంటున్నా. ప్రేక్షకులు ఇలాంటి కొత్త తరహా సినిమాలను ఎంకరేజ్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నా. అన్నారు.
About Writer
దేవీ
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
Allari Naresh :నేర ప్రవృత్తి, మనిషిలోని విభిన్న కోణాలు నేపథ్యంగా అల్లరి నరేష్ ఆల్కహాల్ సిద్ధమైంది