1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Media city in amaravati another attraction for the capital

నవ్యాంధ్ర రాజధాని అమరావతి మీడియా సిటీ

Amaravati Quantum
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో మీడియా సిటీని ఏర్పాటు చేయాలని టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రభుత్వం రూ.5 వేల కోట్లను పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆంధ్రప్రదేశ్ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ తదితర రంగాలను బలోపేతం చేసేలా ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రానికి రూ.5,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు, లక్ష ఉద్యోగాల సృష్టిని లక్ష్యంగా పెట్టుకుని 'ఏవీజీసీ-ఎక్స్ఆర్ విధానం 2026-31'కి పునిచ్చింది. ఇందులో భాగంగా రాజధాని అమరావతిలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన 'మీడియా సిటీ'ని, ప్రత్యేక పార్కును అభివృద్ధి చేయనుంది.
 
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ నెల 10న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నూతన విధానానికి ఆమోదముద్ర పడగా, తాజాగా దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. 2026 నుంచి 2031 వరకు ఐదేళ్ల పాటు అమల్లో ఉండే ఈ పాలసీ ద్వారా ఐదు యాంకర్ యూనిట్లతో పాటు మరో 100 కంపెనీల నుంచి పెట్టుబడులు రాబట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. అమరావతిలోని మీడియా సిటీలో అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి బాధ్యతను ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఏపీసీఆర్డీఏ)కు అప్పగించారు.
 
ఈ విధానం ద్వారా రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించే సంస్థలకు ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఏవీజీసీ-ఎక్స్ఆర్ మౌలిక వసతుల కల్పనకయ్యే ఖర్చులో 50 శాతం రాయితీ (గరిష్ఠంగా రూ.2 కోట్లు), పార్కుల అభివృద్ధికి ప్రాజెక్టు వ్యయంలో 25 శాతం (గరిష్ఠంగా రూ.50 కోట్లు) సబ్సిడీని ప్రభుత్వం అందించనుంది. వీటితో పాటు ఐదేళ్ల పాటు వంద శాతం రాష్ట్ర జీఎస్టీ వాపసు, స్టాంప్ డ్యూటీ మినహాయింపు వంటి ప్రయోజనాలు కల్పించనుంది. రూ.200 కోట్ల పెట్టుబడితో కనీసం 200 మందికి ఉపాధి కల్పించే సంస్థలను 'మెగా ప్రాజెక్టులు'గా గుర్తించి ప్రత్యేక రాయితీలు అందజేయనున్నారు.
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
వినికిడి లోపంతో వున్న మహిళపై లైంగిక దాడి.. వ్యక్తి అరెస్ట్