1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Krishna Express Halted After Smoke Emanates from Coach Near Tirupati

కృష్ణా ఎక్స్‌ప్రెస్ B4 బోగీ నుంచి పొగలు... ఎర్ర జెండా ఊపి..?

train
తిరుపతి జిల్లా బాలాయపల్లి మండలం నిడిగల్లు రైల్వే స్టేషన్ సమీపంలో, కృష్ణా ఎక్స్‌ప్రెస్ రైలులోని B4 బోగీ నుంచి పొగ రావడాన్ని గమనించడంతో ఒక ప్రమాదం తప్పింది. తిరుపతి నుంచి ఆదిలాబాద్‌కు వెళ్తున్న ఈ రైలు, స్టేషన్ సమీపంలో ఉన్నప్పుడు అందులోని బోగీ నుంచి పొగ రావడం మొదలైంది.
 
దీన్ని గమనించిన గేట్‌మెన్ వెంటనే ఎర్ర జెండా ఊపి రైల్వే సిబ్బందిని అప్రమత్తం చేయడంతో, రైలును నిలిపివేశారు. రైల్వే సిబ్బంది వెంటనే స్పందించి, సమస్యను గుర్తించి అవసరమైన మరమ్మతులు చేపట్టారు. 
 
సమస్య పరిష్కారం కావడంతో, రైలు తిరిగి తన గమ్యస్థానం వైపు ప్రయాణాన్ని కొనసాగించింది. ఏసీ కోచ్‌లోని బ్రేకులు పట్టేయడం వల్ల రాపిడికి గురై దట్టమైన పొగలు వెలువడ్డాయి. సిబ్బంది బోగీని పరిశీలించి బ్రేకులను సరిచేశారు. సుమారు 20 నిమిషాల పాటు రైలు నిలిచిపోయింది.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
ప్రియుడితో కలిసి భర్త గొంతు కోసి హత్య చేసిన భార్య, ఇద్దరూ కలిసి పరార్