1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Not the Bhogi that comes before Sankranti, but the Bhogi that comes after

Sharwanand: నేను కూడా విజయ్‌లా సీఎం అవుతానేమో: భోగి ప్రి-రిలీజ్ మీట్లో శర్వా

Sharwanand, Dimple Hayathi
Sharwanand, Dimple Hayathi
'ఎ' సర్టిఫికేట్ పొందిన తెలుగు పీరియడ్ యాక్షన్ డ్రామా 'భోగి', ఇందులో శర్వానంద్ పరాక్రమవంతురాలైన గ్రామస్థుడు గంగగా, డింపుల్ హయాతి ఉగ్రమైన మందరంగా నటించారు. ఈ చిత్రం నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తోంది. సంపత్ నంది దర్శకత్వంలో, కె.కె. రాధామోహన్ నిర్మాణంలో, 1960ల నాటి కల్పిత సరిహద్దు గ్రామం నేపథ్యంలో సాగే ఈ చిత్రం.
 
ఈ చిత్రం యాక్షన్, భావోద్వేగం, గ్రామీణ వాస్తవికతను మేళవిస్తుంది. ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ మరియు మలయాళ భాషలలో విడుదల కానుంది. నవంబర్ 24న హైదరాబాద్‌లో జరిగిన ఒక ఉత్సాహభరితమైన సంగీత కార్యక్రమంలో, చిత్ర బృందం ప్రదర్శనలు, ఆత్మీయ సంభాషణలతో వేడుక చేసుకుంది. ట్రైలర్‌లోని రఫ్ సన్నివేశాలు మరియు పాటలపై అభిమానుల ఉత్సాహం మధ్య, శర్వానంద్ డింపుల్‌ను 'అందాల రాణి' అని పిలవడంతో ఆమె సానుకూల శక్తికి ప్రశంసలు వెల్లువెత్తాయి.
 
దర్శకుడు మాట్లాడుతూ,  గాంజా శంకర్’ కథనే ఇలా చేశారని వార్తలువినిపిస్తున్నాయి. కానీ అది కరెక్ట్ కాదు. అది కంప్లీట్‌గా క్రిమినల్ స్టోరీ. ఇది రూటెడ్ కథ. అన్నాచెల్లెళ్ల కథ. అన్నాచెల్లెళ్ల ఎమోషన్ చుట్టూ తిరిగే కథ.
 
ఇది సంక్రాంతికి ముందు వచ్చే భోగి కాదు. పాత విషయాల్ని, చెడును పాతరేసి, చంపిన తర్వాత వచ్చిన భోగి. ఆ ఊరు కొన్ని విషయాలను నమ్మింది. అవి కరెక్ట్ కాదని ప్రూవ్ చేయడమే కథానాయకుడి లక్ష్యం.
 
- చంద్రబోస్ సినిమా చూశారు. ఆయనకు చాలా నచ్చింది. ఈ సినిమాలో సింగిల్ కార్డ్ అంతా ఆయనతోనే రాయించాను. ప్రతి అక్షరం ఆయనే రాశారు. కథ విని లొకేషన్‌కు వచ్చి, ఆఫీస్‌కు వచ్చి ఈ సినిమాతో చాలా జర్నీ చేశారు.

శర్వానంద్ సింగర్ నర్సన్నను ఉద్దేశించి మాట్లాడుతూ... మీరు చాలామందికి పాటలు పాడారు. సీఎం విజయ్‌కి కూడా పాడారు. ఆయనలా నన్ను కూడా సీఎం చేస్తారా అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.
About Writer
దేవీ
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
Niharika Konidela :పాకెట్ రాకెట్స్ చిత్రం నుంచి అప్సర అంటూ సాగే ఇల్యూష‌న్‌ సాంగ్ రిలీజ్