1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Has Cyclone Akvan retreated from Andhra Pradesh due to the intense cold, heading instead towards Odisha?

ఏపీలో చలిపులి దెబ్బకు తోక ముడిచిన అక్వాన్ తుఫాన్, ఒడిశా వైపు పలాయనం?

Akvan cyclone
అక్వాన్ తుఫాన్ ఏపీపై విరుచుకుపడుతుందోమోననే ఆందోళన వ్యక్తమవుతోంది. ఐతే రాష్ట్రంలో ఇప్పటికే తీవ్రమైన చలిగాలులు వీస్తున్నాయి. మరోవైపు కార్తీక దీపాలు కూడా వెలుగుతున్నాయి. కారణాలు ఏమైతేనేమి... అక్వాన్ తుఫాన్ తన దిశను మార్చుకుని ఇచ్చాపురం-ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం వుందని అంచనా వేస్తున్నారు.
 
తొలుత ఈ తుఫాన్ నెల్లూరు- విశాఖపట్టణం మధ్య తీరం దాటే అవకాశం వుందని అన్నారు. ఇప్పటికే రెండు తుఫానులు కోస్తాంధ్రలో తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఇక మూడోది కూడా వస్తే.. నష్టం అపారంగా వుంటుందన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో తుఫాను కాస్త దిశ మార్చుకున్నదన్న వార్త రావడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు ప్రజలు. ఐతే తాజా వాతావరణ పరిస్థితులు ఆధారంగా తుఫాన్ దిశ, గమనం మారే అవకాశం వుందని విశాఖ వాతావరణ కేంద్రం తెలియజేస్తుంది. తుఫాన్ ఈ నెల 20న తీరం దాటే ఛాన్స్ వుందని చెబుతున్నారు.
About Writer
ఐ వెెంకట్
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(NIFT) హైదరాబాదులో సిపిఎఫ్‌సి కోర్సు చేసారు. జర్నలిజంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం. కవితలు, కథలు రాస్తుంటారు. ప్రముఖ మీడియా సంస్థలైన ETv, ETv2లో పనిచేసారు. స్వాతి సపరివారపత్రిక, సండే ఇండియన్ మ్యాగజైన్ల ఎడిటోరియర్ విభాగంలో పనిచేసారు. 2006 నుంచి వెబ్ దునియా తెలుగు సహ సంపాదకునిగా వ్యవహరిస్తున్నారు. .... మరింత చదవండి
తర్వాతి కథనం
తిరుపతిలో 5,000 ఎకరాల సెమీకండక్టర్ పార్క్.. నారా లోకేష్