30 ఏళ్ల తర్వాత కడప మేయర్ పీఠాన్ని దక్కించుకున్న తెలుగుదేశం
కడప అంటే వైసిపికి కేరాఫ్ అడ్రెస్ అని చెబుతారు. వైసిపికి కంచుకోట అయినటువంటి కడపలో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్నది తెలుగుదేశం పార్టీ. 30 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మేయర్ స్థానాన్ని అది కూడా ఏకగ్రీవంగా తన ఖాతాలో వేసుకున్నది తెదేపా. మట్లి సువర్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆమెతో పాటు మరో 66 మంది కార్పొరేటర్లు పదవీప్రమాణ స్వీకారం చేసారు.
గత 2024 శాసన సభ ఎన్నికల్లో కడప నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికైన రెడ్డప్పగారి మాధవీరెడ్డి కృషితో పాటు కూటమి నాయకులు కలిసికట్టుగా పనిచేయడంతో మేయర్ స్థానం తెదేపా దక్కించుకున్నది. అంతకుముందు వైసిపి హయాంలో తనకు ప్రోటోకాల్ ప్రకారం గౌరవం ఇవ్వడం లేదంటూ ఎమ్మెల్యే మాధవీరెడ్డి కడప కార్పొరేషన్ కార్యాలయంలో నిరసన చేసిన సంగతి తెలిసిందే.

