Dimple, Sharwa: డింపుల్ హయాతికి శర్వానంద్ ఎందుకు పెద్దపీట వేశాడో తెలుసా
Sarva, Anupama, dimple
ఇదిలా వుండగా, ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ కూడా వుంది. మెయిన్ హీరోయిన్గా రిలీజ్ చేసిన ఆమె ఫస్ట్ లుక్ పోస్టరే చెప్తుంది. కానీ ఆ తర్వాత ఆమె ఎక్కడా కనిపించలేదు. విశ్వసనీయ సమాచారం మేరకు భోగిలో సెకండ్ హీరోయిన్ అయిన డింపుల్ హయాతి ప్రమోషన్లలో చురుగ్గా పాల్గొంటుండటంతో అసలు ఏం జరుగుతోందనే ఆసక్తి మొదలైంది.
డింపుల్ హయాతిని మొదట ఓ ప్రత్యేక పాత్ర కోసమే తీసుకున్నారని, ఆ తర్వాత కథలో మార్పులు చేయడంతో ఆమెకి ఎక్కువ ప్రాధాన్యత వచ్చిందని ప్రచారం జరుగుతోంది. అనుపమకు మొదట చెప్పిన కథకు, ప్రస్తుతం తెరకెక్కిన కథకు మధ్య మార్పులు జరిగాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
అయితే ఈ విషయమై సినిమా విడుదలై ఆదరణ పొందితే బాగానే వుంటుంది. అటూ ఇటూ అయితే భోగీ నిజంగా మంటల సెగలు పుట్టిస్తోందేమో చూడాలి. ఇప్పటికే ఆదర్శకుటుంబంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించిన పూజిత తనను తీసేశారనే విషయం హాట్ టాపిక్‌గా మారింది.

