సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రవి కిషన్, నగ్మా లవ్ స్టోరీ
Ravi Kishan, Nagma
వివిధ కథనాల ప్రకారం, ఆ సమయంలో రవి కిషన్ తన భార్యను నెలకు ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే కలిసేవారట. రవికిషన్ తన సమయం మొత్తాన్ని నగ్మాతోనే గడిపేవారు. ఎప్పుడూ ఆమె వెంటే ఉంటూ, ఆమెకు దగ్గరగా ఉండేవారు.
ఆయన ప్రవర్తన వల్ల ఆయన భార్య, నలుగురు పిల్లలు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. వారు ఆ పరిస్థితిని ఎదుర్కోవడంలో చాలా ఇబ్బంది పడ్డారు. అయితే, కాలక్రమేణా పరిస్థితులు మారాయి. తమ బంధం రవి కిషన్ కుటుంబ జీవితంపై ప్రభావం చూపుతోందని, తెలుసుకున్న నగ్మా... రవి కిషన్‌కు దూరమయ్యారు.
అంతేగాకుండా రవిని ఆయన భార్యాపిల్లల వద్దకే వెళ్లమన్నారు. దీంతో రవి కిషన్ తన కుటుంబం వద్దకు తిరిగి వెళ్లి, భార్య, పిల్లలతో తన జీవితాన్ని మళ్లీ చక్కదిద్దుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ స్టోరీ అప్పట్లో సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

