ఆటో జానీ గుర్తున్నాడా... ఈ సంక్రాంతికి మీ ముందుకు వస్తున్నాడు...
మెగాస్టార్ చిరంజీవి చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం కాకా. ఇందులో కదిరి కాళిదాస్‌గా కనిపించనున్నారు. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం తాజాగా ఓ అప్‌డేట్‌ను పంచుకుంది. 'ఆటో జానీ గుర్తున్నాడా? ఈ సంక్రాంతికి సరికొత్తగా #KAAKAలో మీ ముందుకు వస్తున్నాడు' అనే క్యాప్షన్‌తో పోస్టర్‌ను పంచుకుంది. దీంతో చిరు ఇందులో తన గత చిత్రం 'రౌడీ అల్లుడు'లోని ఆటో జానీ లాంటి పాత్రలో కూడా కనిపించనున్నారని తెలుస్తోంది.
ఇక, ఈ సినిమాలో దర్శక, నటుడు అనురాగ్ కశ్యప్, అనస్వర రాజన్ కీలక పాత్రల్లో నటించనున్నారు. ప్రియమణి, నివేదా థామస్, సునీల్, మురళీ శర్మ, గెటప్ శ్రీను తదితరులు కనిపించనున్నారు. తమన్ సంగీతం అందించనున్నారు. చిరంజీవి ఈ యేడాది సంక్రాంతికి మన శివ శంకర ప్రసాద్ మూవీతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న విషయం తెల్సిందే.

