1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Chiranjeevi 's Rustum title finalized Virat as a hero

Rushum: విరాట్ హీరోగా చిరంజీవి నటించిన రుస్తుం టైటిల్ ఖరారు

Rustum as Virat
Rustum as Virat
ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ తమ కొత్త సినిమాను ప్రకటించింది. విరాట్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ‘రుస్తుం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. డెబ్యూ డైరెక్టర్ కనిష్క గంధం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. విరాట్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ గ్లింప్స్ సినిమా ప్రపంచాన్ని ఆసక్తికరంగా పరిచయం చేస్తోంది.
 
‘రుస్తుం’ అనే టైటిల్‌కు గతంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన బ్లాక్‌బస్టర్ సినిమాకు ఇదే టైటిల్ కావడం విశేషం. ఇప్పుడు మేకర్స్ సరికొత్త విజన్‌తో ఈ టైటిల్‌ను మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమా ఒక ఇంటెన్స్, డిఫరెంట్ యాక్షన్ డ్రామాగా ఉండబోతోంది.
 
టైటిల్ గ్లింప్స్‌లో స్టైలిష్ యానిమేషన్, ఆకట్టుకునే విజువల్స్, ఇంప్రెసివ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో సినిమా ప్రపంచంలోని విభిన్న అంశాలను పరిచయం చేశారు. చివర్లో విరాట్‌ పాత్రను రివీల్ చేశారు. ముఖాన్ని చూపించకుండానే ఆయన చక్కటి ఫిజిక్, ఇంపోజింగ్ ప్రెజెన్స్‌తో ఆసక్తి పెంచారు. ఈ రివీల్‌తో ప్రేక్షకుల్లో సినిమా గురించి మరింత తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఏర్పడింది.
 
రెగ్యులర్ యాక్షన్ సినిమాలకు భిన్నంగా ‘రుస్తుం’ను ఒక ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా రూపొందిస్తున్నారు. ఆకట్టుకునే యాక్షన్ సీక్వెన్స్‌లు, ప్రత్యేకంగా డిజైన్ చేసిన సినిమా ప్రపంచం, అద్భుతమైన విజువల్ ఎక్స్‌పీరియన్స్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. పవర్‌ఫుల్ స్టోరీటెల్లింగ్, గ్రిప్పింగ్ డ్రామా, లోతైన హ్యూమన్ ఎమోషన్స్ కలగలిపిన ఈ కథలో ఒక వ్యక్తి తనతో తానే చేసే పోరాటాన్ని చూపించబోతున్నారు. ఇందులో గిల్ట్ అతనికి ఎదురయ్యే అతిపెద్ద శత్రువుగా నిలుస్తుంది.
 
ఆసక్తికరమైన టైటిల్, ఇంప్రెసివ్ గ్లింప్స్, ప్రతిష్టాత్మకమైన విజన్‌తో ‘రుస్తుం’ సినిమా ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతోంది. ఈ టైటిల్ గ్లింప్స్‌తో సినిమా జర్నీ ప్రారంభమైంది. మేకర్స్ త్వరలో మరిన్ని క్రేజీ అప్‌డేట్స్‌ రాబోతున్నారు.
About Writer
దేవీ
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
Maheshbabu: వారణాసి అనుకున్న టైంకే - మరోవైపు మహేష్ బాబు పుట్టినరోజుకు వాయిదా !