1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Latest update on Pawan Kalyan-s OG 2

OG 2 Latest update :పవన్ కళ్యాణ్ ఓజీ 2 గురించి తాజా అప్‌డేట్

OG 2 latest poster
OG 2 latest poster
పవన్ కళ్యాణ్ నటించనున్న ఓజీ 2 గురించి ఇంతకుముందే వెల్లడించారు. అయితే ఇటీవలే జరిగిన పరిణామాల వల్ల పవన్ కళ్యాణ్ ఆరోగ్యం వల్ల కొంత కాలం విరామం తీసుకోవాల్సి వస్తుంది. ఈ టైంలో పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ టీమ్ ఓ ఫొటోను విడుదల చేసింది. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సెప్టెంబర్ 2న 11.11. నిముషాలకు కొత్త అప్ డేట్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇక దానితోపాటు మరో సినిమా కూడా వుండబోతోందని అభిమానులు కూడా ఓ పోస్టర్ విడుదల చేశారు.అందులో ఎంత నిజముందో తెలియాల్సివుంది.
 
'OG యూనివర్స్'లో ప్రవేశించడానికి సిద్ధంగా ఉండండి. మీ కోసం ఒక పెద్ద ఆశ్చర్యం ఉంది. అని పేర్కొంది. ఇప్పటికే సంగీత దర్శకుడు థమన్ తన బాణీల పనిలో వున్నారు. దర్శకుడు సుజీత్ కూడా సరికొత్తగా స్టయిలిష్ గా పవన్ ను చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. 
 
‘ఓజస్ గంభీరా’ పాత్రలో పవన్ కళ్యాణ్ స్టైలిష్ అవతారం, ముంబై మాఫియా నేపథ్యంలో సాగే కథ, సుజీత్ టేకింగ్, తమన్ అందించిన పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.  అయితే సినిమా  ఓటీ 2 షూటింగ్ ఇంకా ప్రారంభం కాకపోవడంతో పెద్ద వీడియో కంటెంట్ విడుదలయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి.
 
అందుకేమేకర్స్ అభిమానులను నిరాశపరచకుండా ఒక స్పెషల్ పోస్టర్, కాన్సెప్ట్ ఆర్ట్ లేదా చిన్న గ్లింప్స్‌ను విడుదల చేసే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది.మొదటి భాగం సృష్టించిన హైప్‌ను మరింత పెంచేలా రెండో భాగాన్ని గ్రాండ్ స్కేల్‌లో ప్లాన్ చేస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.
About Writer
దేవీ
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
Raja Singh: ఫ్యామిలీతో చూసే సినిమా తీయండని యశ్‌కు రాజాసింగ్ విజ్ఞప్తి