సంబంధిత వార్తలు
- 'మరో చరిత్ర'లు మళ్లీ కావాలి... 2.O పై షాకింగ్ కామెంట్... సి. కల్యాణ్ బర్త్ డే స్పెషల్ ఇంటర్వ్యూ
- తారక్ అన్నయ్య పుత్రుడే కాదు.. నాకూ కుమారుడే : బాలయ్య
- బట్టేబాజ్ మాటలు చెప్పిండు... ఆంధ్రకు వస్తావా..? దమ్ముంటే రా... బాలకృష్ణ ఛాలెంజ్
- గల్లీ బుద్దులు చూస్తుంటే జాలేస్తుందిరా బయ్... బిడ్డా తీసేసి చూడు: కేసీఆర్‌కు బాలయ్య ఛాలెంజ్
- బాలయ్యకు పౌరుషం లేదు... పనికిరాని గన్నేరు పప్పు లోకేష్... రోజా సెటైర్లు
బాలకృష్ణ గురించి నాగబాబు షాకింగ్ కామెంట్స్..!
మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు నాగబాబు ఓ యూ ట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నందమూరి బాలకృష్ణ గురించి సంచలన వ్యాఖ్యలు చేయడం అటు అభిమానుల్లోను, ఇటు ఇండస్ట్రీలోను హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకీ విషయం ఏంటంటే... సీనియర్ జర్నలిస్ట్ ప్రభు నాగబాబుని ఇంటర్వ్యూ చేస్తూ... బాలకృష్ణ గురించి చెప్పమని అడిగితే.. ఐయామ్ సారీ, నేను తన గురించి మాట్లాడను! అంటూ ఝలకిచ్చారు. ఈ మాట అన్న తరువాత వెంటనే మళ్లీ తన మాట సవరించుకుంటూ బాలయ్య ఎందుకు తెలియదు.. ఆయనో సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్.. అప్పట్లో నేరము-శిక్ష వంటి చిత్రాల్లో కృష్ణతో కలిసి నటించారు అని తనదైన శైలిలో బాలయ్యకు కౌంటరిచ్చాడు.
గత కొంతకాలంగా జనసేనాని పవన్ పైన బాలకృష్ణ వ్యంగ్యంగా సెటైర్లు వేస్తున్న విషయం తెలిసిందే. దాన్ని దృష్టిలో పెట్టుకున్న నాగబాబు వ్యంగ్యంగా కౌంటర్‌లు వేయడం చర్చనీయాంశంగా మారింది. సీనియర్ జర్నలిస్ట్ ప్రభు బాలయ్య గురించి మళ్లీ చెప్పే ప్రయత్నం చేసినా తనంటే ఎవరో నాకు తెలియదని నాగబాబు లైట్ తీసుకోవడంతో కావాలనే ఆయన ఇలా మాట్లాడుతున్నాడని తెలిసింది. నాగబాబు వ్యాఖ్యల గురించి బాలకృష్ణ కానీ.. నందమూరి అభిమానులు కానీ రియాక్ట్ అవుతారేమో చూడాలి.
తర్వాతి కథనం
