1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Nithya Menen opens up on marriage

సరైన వ్యక్తి తారసపడితే పెళ్లి చేసుకుంటా : నిత్యా మేనన్

nithya menon
తాను పెళ్లి చేసుకోనని ఎన్నడూ చెప్పలేదని, నా మనస్సుకు సరైన వ్యక్తి తారసపడితే వివాహం చేసుకుంటానని ప్రముఖ హీరోయిన్ నిత్యా మేనన్ అన్నారు. తాజాగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను ఆమె వెల్లడించారు. తనకు పెళ్లి కంటే ఎక్కువగా సరైన బంధానికే ప్రాధాన్యమిస్తానని తెలిపారు. 
 
'నేను పెళ్లి చేసుకోను అని చెప్పినప్పుడు.. పెళ్లికి వ్యతిరేకమని, అసలు చేసుకోవాలనే లేదని అందరూ భావించారు. కానీ, నా ఉద్దేశం అది కాదు. నాకూ పెళ్లి చేసుకోవాలని ఉంటుంది. అయితే ఎలాంటి వ్యక్తి కావాలి? బంధం ఎలా ఉండాలి? అనే విషయంలో నాకో స్పష్టత ఉంది. నా లక్ష్యం పెళ్లి చేసుకోవడం మాత్రమే కాదు.. సరైన వ్యక్తితో సరైన బంధాన్ని ఏర్పరచుకోవడం’’ అని ఆమె స్పష్టం చేశారు.
 
'నాకు సవాళ్లు ఎదురైనప్పుడే కొత్త విషయాలు నేర్చుకోగలను. చిన్నప్పటి నుంచీ ఎవరైనా నన్ను తదేకంగా చూస్తే వెళ్లిపోమని చెప్పేదాన్ని. నాకు సిగ్గు ఎక్కువ. అందరి ముందూ కనిపించడం అంతగా ఇష్టం ఉండదు. ఇబ్బందిగా అనిపిస్తుంది. అదొక సవాలు లాంటిది. ఎందుకు అసౌకర్యంగా అనిపిస్తోంది? దాని వెనుక కారణమేంటి? అని నన్ను నేను ప్రశ్నించుకుంటాను. అది మనల్ని మనం అంచనా వేసుకునే విధానానికి సంబంధించిన విషయమని అనిపిస్తుంది' అని ఆమె తెలిపారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
Varanasi postponed? : వారణాసి ఏరియల్ షాట్ లీక్, పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం, విడుదల వాయిదా .?