1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Nigeria President Bola Tinubu revealed water stopped running at the Presidential Villa while he was shaving

షెవింగ్ చేస్తుండగా ఆగిపోయిన నీటి సరఫరా - నైజీరియా దేశాధ్యక్షుడికి వింత అనుభవం!

nigeria president bola tinubu
నైజీరియా దేశ అధ్యక్షుడుకి ఓ వింత అనుభవాన్ని ఎదుర్కొన్నారు. తమ దేశంలోని సామాన్యులు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యను ఆయన కూడా అనుభవించారు. తాను షేవింగ్ చేసుకుంటుండగా అకస్మాత్తుగా నీటి సరఫరా ఆగిపోయిందని స్వయంగా వెల్లడించారు. ఈ సమస్యను సామాన్యులతో పాటు దేశాధ్యక్షుడు కూడా ఎదుర్కొంటున్నానని తెలిపారు. 
 
గతవారం లాగోస్‌లో తమ కుటుంబ ప్రార్థనా సమావేశం జరిగింది. ఇందులో నైజీరియా అధ్యక్షుడు బోలా టినుబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన అధికారిక నివాసమైన 'అసో రాక్' భవనంలో ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు. గత బుధవారం తాను షేవింగ్ చేసుకుంటుండగా అకస్మాత్తుగా నీటి సరఫరా నిలిచిపోయిందని చెప్పారు. 
 
'రాష్ట్రపతి భవనంలోనూ ఇలాంటి ఇబ్బందులు ఉంటాయని చాలామందికి తెలియదు. ఆ సమయంలో వీళ్లు ఆగిపోయాయి. ఈ లోపాలన్నింటినీ మేము సరిదిద్దుతాం. వెలుగు లేదు, నీళ్లు లేవు, విద్యుత్ లేదు అంటే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది? ఇప్పుడే మా ప్రయాణం మొదలైంది. సమస్యలన్నింటినీ ఖచ్చితంగా అధిగమిస్తాం.. నైజీరియా కోసం చేసి చూపిస్తాం' అని టీసుబు స్పష్టం చేశారు. 
 
అసో రాక్ భవనంలో నైజీరియా అధ్యక్షుడి అధికారిక నివాసంతో పాటు పరిపాలనా కేంద్రంగా వ్యవహరిస్తోంది. దేశంలోనే అత్యున్నత ప్రాంగణమైన ఈ భవనానికి నిరంతర విద్యుత్ కోసం గత ఏడాది సుమారు 10 బిలియన్ నైరాలను (దాదాపు 7.2 మిలియన్ డాలర్లు) ఖర్చు చేసి సోలార్ మిన-గ్రిడ్‌ను ఏర్పాటుచేశారు. జాతీయ గ్రిడ్‌పై ఆధారపడకుండా విల్లాకు ప్రత్యేకంగా విద్యుత్ అందించేందుకు ప్రస్తుతం దీనిని పరీక్షిస్తున్నారు. అయినప్పటికీ అక్కడ విద్యుత్, నీటి కొరత తలెత్తడం గమనార్హం. 
 
కాగా, నైజీరియాలో ప్రస్తుతం విద్యుత్ కోతలు పెరిగిపోవడానికి గ్యాస్ సరఫరాలో కొరత, జలవిద్యుత్ ఉత్పత్తి పడిపోవడమే ప్రధాన కారణాలని అధికారులు చెబుతున్నారు. ప్రధాన గ్రిడ్ పూర్తిగా కుప్పకూలకపోయినప్పటికీ, లాగోస్, అబూజా వంటి ప్రధాన నగరాల్లో విద్యుత్ పంపిణీ సంస్థలు రొటేషన్ పద్ధతిలో కోతలు విధిస్తున్నాయి. మరోవైపు పట్టణాలు వేగంగా విస్తరిస్తున్నప్పటికీ, అందుకు తగ్గట్టుగా పైపులైన్లు, శుద్ధి కేంద్రాలు లేకపోవడంతో తాగునీటి ఎద్దడి ప్రజలను తీవ్రంగా వేధిస్తోంది.
 
ఈ పరిణామం నైజీరియా రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. 2022 నాటి ఎన్నికల ప్రచారంలో టినుబు మాట్లాడుతూ.. "ఎలాగైనా సరే దేశంలో విద్యుత్ సరఫరాను మెరుగుపరుస్తాం. ఈ హామీని నెరవేర్చకపోతే రెండోసారి నన్ను ఎన్నుకోవద్దు" అని బహిరంగంగా ప్రకటించారు. ఇప్పుడు 2027 జనవరి 16న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆయన మళ్లీ పోటీకి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో అధ్యక్ష భవనానికే విద్యుత్, నీళ్లు సరిగా లేకపోవడం ఆయన పాలనా వైఫల్యానికి నిదర్శనమని ప్రధాన ప్రతిపక్ష నాయకులు అతికు అబూబకర్, పీటర్ ఒటి వర్గాలు విమర్శిస్తున్నాయి. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
మద్యం సేవిస్తే హెచ్చరించే హెల్మెట్ - టెన్త్ విద్యార్థినిల ఆవిష్కరణ - 500 టెస్టులు పాస్