1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Jensen Huang Eyes Comeback As Nvidia CEO, Allies Form 'War Room': Report

జెన్సన్ హువాంగ్ చేతికి మళ్లీ ఎన్విడియా పగ్గాలు?

Alice Huang - Jensen Huang
టెక్నాలజీ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తున్న చిప్ మేకర్ ఎన్విడియాలో కీలక పరిణామాలు శరవేగంగా చోటు చేసుకుంటున్నాయి. చైనా మహిళా గూఢచారిణితో వివాహేతర సంబంధఁ పెట్టుకున్న ఆరోపణలు ఎదుర్కొంటున్న జెన్సన్ హువాంగ్ ఆ పదవికి రాజీనామా చేశారు. అయితే, ఇపుడు మళ్లీ తిరిగి ఆ పదవిని చేపట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. పైగా, ఆయన పునరాగమనం కోసం సిలికాన్ వ్యాలీలోని పలువురు ప్రముఖులు, పెట్టుబడిదారులు ఎన్విడియా బోర్డుపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ పరిణామాలపై 'ఫైనాన్షియల్ టైమ్స్' ఒక సవివరమైన కథనాన్ని ప్రచురించింది.
 
కంపెనీలో తన కింద పనిచేసే ఉన్నతాధికారిణి కింబర్లీ పావెల్‌తో పాటు సింగపూర్‌కు చెందిన మెగాస్పీడ్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఆలిస్ హువాంగ్ జెన్సన్‌కు ఉన్న అఫైర్లు బయటకు రావడంతో ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ రాజీనామా 4 ట్రిలియన్ డాలర్ల విలువైన ఎన్విడియాలో నాయకత్వ సంక్షోభానికి దారితీసింది. అయితే, రాజీనామా చేసిన కొద్ది రోజులకే జెన్సన్ హువాంగ్ తిరిగి రావాలని కోరుతూ మద్దతుదారులు ఒక ప్రచారాన్ని ప్రారంభించారు.
 
హువాంగ్‌ను తిరిగి తీసుకురావాలంటూ 'బ్రింగ్ జెన్సన్ బ్యాక్' పేరుతో ప్రారంభమైన ఈ ప్రచారానికి టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్, ఎపిక్ గేమ్స్ సీఈఓ టిమ్ స్వీనీ వంటి దిగ్గజాలు బహిరంగంగా మద్దతు తెలిపారు. హువాంగ్ మద్దతుదారులు ఒక 'వార్ రూమ్' ఏర్పాటు చేసి, బోర్డు సభ్యులను ఒప్పించేందుకు, వైట్ హౌస్ మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఈ ప్రయత్నాలకు జెన్సన్ హువాంగ్ ఆమోదం కూడా ఉందని తెలుస్తోంది. 
 
అయితే, హువాంగ్ పునరాగమనానికి కొన్ని అడ్డంకులు కూడా ఉన్నాయి. అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్, ఎన్విడియా నాయకత్వంలో సమూల మార్పులు రావాలని పిలుపునిచ్చారు. ఇది హువాంగ్ రీఎంట్రీకి వ్యతిరేక సంకేతంగా భావిస్తున్నారు. మరోవైపు, జెన్సన్ రాజీనామాకు దారితీసిన ప్రవర్తనపై ఎన్విడియా బోర్డు స్వతంత్ర విచారణ జరుపుతోంది. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
2029 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ నరేంద్ర మోదీని ఓడించగలరా?