Ugadi

Notifications

  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. ఉగాది



ఏపీలో చలిపులి దెబ్బకు తోక ముడిచిన అక్వాన్ తుఫాన్, ఒడిశా వైపు పలాయనం?

ఏపీలో చలిపులి దెబ్బకు తోక ముడిచిన అక్వాన్ తుఫాన్, ఒడిశా వైపు పలాయనం?అక్వాన్ తుఫాన్ ఏపీపై విరుచుకుపడుతుందోమోననే ఆందోళన వ్యక్తమవుతోంది. ఐతే రాష్ట్రంలో ఇప్పటికే తీవ్రమైన చలిగాలులు వీస్తున్నాయి. మరోవైపు కార్తీక దీపాలు కూడా వెలుగుతున్నాయి. కారణాలు ఏమైతేనేమి... అక్వాన్ తుఫాన్ తన దిశను మార్చుకుని ఇచ్చాపురం-ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం వుందని అంచనా వేస్తున్నారు. తొలుత ఈ తుఫాన్ నెల్లూరు- విశాఖపట్టణం మధ్య తీరం దాటే అవకాశం వుందని అన్నారు. ఇప్పటికే రెండు తుఫానులు కోస్తాంధ్రలో తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఇక మూడోది కూడా వస్తే.. నష్టం అపారంగా వుంటుందన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో తుఫాను కాస్త దిశ మార్చుకున్నదన్న వార్త రావడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు ప్రజలు.

రేవంత్ రెడ్డి ఏమో పండబెట్టి తొక్కుత అంటడు : రాజగోపాల్ రెడ్డి

రేవంత్ రెడ్డి ఏమో పండబెట్టి తొక్కుత అంటడు : రాజగోపాల్ రెడ్డితెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోమారు మాటలతో రెచ్చిపోయాడు. తాజాగా జరిగిన ఓ సమావేశంలో రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. ఈ సమావేశంలో రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి ఏమో పండబెట్టి తొక్కుత అంటడు. నువ్వేం ముఖ్యమంత్రి.. నీదేం భాష.. కొడంగల్‌కు పదివేల కోట్లు తీసుకుపోతావ అంటున్నావ్... మునుగోడుకు కూడా ఇవ్వు అంటే ఎవడాడు.. పండబెట్టి తొక్కుతా అంటావా? రేవంత్ రెడ్డి.. నువ్వు పండబెట్టి తొక్కుతా అంటే రాజగోపాల్ రెడ్డి తొక్కించుకునేలా కనిపిస్తున్నాడా.. ఏదో అదృష్టం కలిసివచ్చి సీఎం అయ్యావు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

కార్తీక మాసం తొమ్మిదో రోజున తులసీ పూజ.. సిరిసంపదల కోసం...?

కార్తీక మాసం తొమ్మిదో రోజున తులసీ పూజ.. సిరిసంపదల కోసం...?కార్తీక మాసం తొమ్మిదో రోజున (నవంబర్ 18-11-2026) తులసీ పూజ చేయడం విశిష్ట ఫలితాలను ఇస్తుంది. ఈ నెలలో శివ, విష్ణు పూజలు దీపారాధన ఉత్తమ ఫలితాలను ప్రసాదిస్తుంది. ముఖ్యంగా కార్తీక మాసం తొమ్మిదో రోజైన బుధవారం ఉదయం బ్రహ్మ ముహూర్త వేళ, లేకుంటే సాయంత్రం పూట తులసీ కోట ముందు దీపం వెలిగించాలి. అంతకుముందు తులసీ కోట ముందు శుభ్రం చేసి.. ముగ్గులు, పువ్వులతో అలంకరించుకోవాలి. దీపం వెలిగించిన తర్వాత ధూపం వేసి కర్పూర హారతి, నైవేద్యం సమర్పించాలి. తులసీ మాతకు పండ్లు లేదా బెల్లం నైవేద్యంగా సమర్పించడం కార్యసిద్ధిని, అనుకున్న కోరికలను నెరవేరుస్తుంది. ఆపై తులసి అష్టోత్తరం, తులసీ స్తోత్రం చదువుకోవాలి. తులసీ మొక్క చుట్టూ 3,5, 11 ప్రదక్షిణలు చేయడం ద్వారా దీర్ఘ సుమంగళీ ప్రాప్తం చేకూరుతుంది.