1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Motion video released for 'Adi Rudra'; film to go on sets starting in January

Adi Rudra: జనవరి నుంచి సెట్ పైకి వెళ్ళనున్న ఆది రుద్ర మోషన్ వీడియో రిలీజ్

Adi, Saikumar and AdiRudra poster
Adi, Saikumar and AdiRudra poster
ఆది సాయికుమార్ ప్రధాన పాత్రలో దైవిక రహస్య థ్రిల్లర్ 'ఆది రుద్ర'.. చారిత్రక నేపథ్యంతో సాగే ఈ చిత్రం, దైవత్వం, విశ్వాసం, ఆధ్యాత్మికత మరియు మానవ అవగాహనకు అందని రహస్యాల మధ్య ఉన్న బలమైన అనుబంధాన్ని ఆవిష్కరిస్తుంది. ఆది సాయికుమార్ నటిస్తున్న చిత్రానికి సంబంధించిన టీజర్ పోస్టర్‌ను సరా పర్వదినం సందర్భంగా విడుదల చేశారు.
 
 
ఆది రుద్ర టైటిల్ పోస్టర్‌లో ఆది సాయికుమార్ త్రిశూలం పట్టుకుని, వెనక్కి తిరిగి నిలబడిన తీరు ఆకట్టుకుంటోంది. లో యాంగిల్‌లో రూపొందించిన ఈ కంపోజిషన్ ఆయన ఇంటెన్స్ ప్రజెన్స్  మరింత ప్రభావవంతంగా చూపిస్తోంది.  ఆకాశాన్ని తాకేలా కనిపించే భారీ పర్వతాకార నిర్మాణంపై దుర్గామాత రూపం దర్శనమిస్తోంది. మరోవైపు, వెలుగుతున్న కాగడాలు పట్టుకున్న భారీ జనసమూహం వృత్తాకారంలో ఉన్న యజ్ఞస్థలాన్ని చుట్టుముట్టిన దృశ్యాలు పోస్టర్‌కు మరింత మిస్టరీని జోడిస్తున్నాయి. మనిషికి, అతీంద్రియ ప్రపంచం పథ్యంలో ఈ కథ సాగనుందనే ఆసక్తిని ఈ విజువల్స్ కలిగిస్తున్నాయి.
 
1960ల నుంచి 1990ల మధ్య కాలంలో జరిగే కథతో ‘ఆది రుద్ర’ తెరకెక్కుతోంది. ఈ ప్రత్యేకమైన పీరియడ్ నేపథ్యం సినిమాలోని పాత్రలు, విజువల్ స్టైల్, ఆ కాలం నాటి వాతావరణాన్ని మళ్లీ సృష్టిస్తూ, ఆసక్తికరమైన దైవిక రహస్యాన్ని మిళితం చేసి ప్రత్యేకమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించాలనేది మేకర్స్ లక్ష్యం.
 
ఈ చిత్రానికి ఏజే శెట్టి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు బి. అజనీష్ లోక్‌నాథ్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తుండటంతో అంచనాలు మరింత పెరిగాయి. మోషన్ వీడియోకు ఆయన అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్  డివైన్ వైబ్ ను అద్భుతంగా ఆవిష్కరిస్తోంది.
 
దైవత్వం, విశ్వాసం, ఆధ్యాత్మికత, అంతుచిక్కని రహస్యాల చుట్టూ సాగే ‘ఆది రుద్ర’ భావోద్వేగాలు ఉత్కంఠభరితమైన సన్నివేశాలు, ఆకట్టుకునే థియేట్రికల్ ప్రజెంటేషన్‌తో ప్రేక్షకులకు మరపురాని సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించనుంది. ఆసక్తికరమైన కథాంశం, ప్రత్యేకమైన పీరియడ్ నేపథ్యంతో ఆది సాయికుమార్ కెరీర్‌లో విభిన్నమైన చిత్రంగా నిలవనుంది.
 
ఈ సినిమా షూటింగ్‌ను జనవరిలో ప్రారంభించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. షూటింగ్ షెడ్యూల్, ఇతర నటీనటులు, సాంకేతిక బృందానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో ప్రకటించనున్నారు
తెలుగు, కన్నడ, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. 
About Writer
దేవీ
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
Shriya Reddy: దసరా నాడు ప్రచండ దేవతగా శ్రీయా రెడ్డి కనిపించిన మహాకాళి పోస్టర్లు