director Ashok :భాగమతి దర్శకుడు అశోక్ పై కేసు నమోదు ?
Updated: Sat, 11 Jul 2026 (14:15 IST)
నానితో పిల్ల జమిందార్, ఆదిసాయికుమార్ తో సుకుమారుడు, అనుష్క తో భాగమతి చిత్రాలు తీసిన దర్శకుడు ఇప్పుడు ఓ కేసును ఎదుక్కొంటున్నట్లు ఫిలిం నగర్ కథనాలు చెబుతున్నాయి. ఔత్సాహిక కళాకారుడిని హీరోగా సినీ పరిశ్రమకు పరిచయం చేస్తానని హామీ ఇచ్చి, అతని తల్లిదండ్రుల నుంచి రూ.3.5 కోట్లు తీసుకున్నారనే ఆరోపణలపై దర్శకుడు గుడ్లూరి అశోక్ బాబుపై కేసు నమోదైంది.
హామీ ఇచ్చినప్పటికీ యువకుడిని హీరోగా పరిచయం చేయకపోవడంతో పాటు తీసుకున్న డబ్బులను కూడా తిరిగి ఇవ్వలేదని ఆరోపిస్తూ బాధిత యువకుడి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఫిర్యాదు మేరకు సైబరాబాద్ ఎకనామిక్ ఆఫెన్సెస్ వింగ్ (EOW) పోలీసులు కేసు నమోదు చేసి, నిర్మాత విజయలక్ష్మి, దర్శకుడు గుడ్లూరి అశోక్ బాబులను విచారిస్తున్నారని సమాచారం.
భాగమతి తర్వాత తెలుగు సినిమాకు దూరంగా వున్న అశోక్ దక్షిణాది భాషల్లో పలు సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆయన నాట్యకారుడు కూడా. అంతే కాకుండా తమిళం, కన్నడం, మలయాళం బాగా మాట్లాడగలడు. హిందీ, అరబ్బీ, జర్మన్, రష్యన్ భాషలు కూడా నేర్చుకున్నాడు.
దేవీ (మురళీకృష్ణ)
నిక్‌నేమ్- శక్తిమాన్
సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక......
మరింత చదవండి