1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Man-Eater Tiger Captured In Maharashtra's Chandrapur

హమ్మయ్య పులిని పట్టేశారు.. నరభక్షక పులిని పట్టుకున్న సిబ్బంది

tiger
మహారాష్ట్రలో మనుషులను చంపుతున్న ఓ పులిని అటవీ సిబ్బంది ఎట్టకేలకు పట్టుకున్నారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకుని సంబరాలు చేసుకుంటున్నారు. మహారాష్ట్రలోని చంద్రపుర్ జిల్లా సావిలీ తాలూకాలోని అటవీ ప్రాంతంలో ఓ పులి నెల రోజుల్లో ముగ్గురిని చంపేసింది. టీ 122 అనే పేరు పెట్టిన ఈ పులిని అటవీశాఖ అధికారులు ఎట్టకేలకు సాహసం చేసి బంధించారు. 
 
గత 30 రోజుల్లో ఆ పులి వ్యాహాడ్ అటవీ ప్రాంతంలో ముగ్గురు పశువుల కాపరులను ఈ బెబ్బులి హతమార్చింది. ఈ పరిసరాల్లోని సామదా, నీలసని, పెడగావ్, సోనాపుర్, వాగోలి గ్రామాల ప్రజలు అటవీ ప్రాంతంలోకి వెళ్లేందుకు జంకుతున్నారు. 
 
పులిని వెంటనే పట్టుకోవాలని అటవీ అధికారులను కోరారు. సీఎఫ్‌ఓ రామానుజం, డీఎఫ్‌ఓ రంజన్‌ తలమేరిలు.. అటవీ ప్రాంతంలో ట్రాప్‌ కెమెరాలతో పాటు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశారు. శనివారం ట్రాప్‌ కెమెరాకు చిక్కిన బెబ్బులిని.. బృందం సాయంతో మత్తు ఇంజక్షన్‌ ఇచ్చి బోనులో బంధించారు. దీంతో పరిసర ప్రాంత వాసులు ఊపిరి పీల్చుకున్నారు.
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
అక్టోబర్ 25, 2026 నాటి తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?