National News In Telugu

Notifications

  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు



సీఎం విజయ్‌కి వున్న ఒకే ఒక్క టెన్షన్ అనగానే త్రిష... త్రిష అంటూ నినాదాలు, ఎక్కడ?

సీఎం విజయ్‌కి వున్న ఒకే ఒక్క టెన్షన్ అనగానే త్రిష... త్రిష అంటూ నినాదాలు, ఎక్కడ?తమిళనాడు మాజీ మంత్రి ఉదయనిధి స్టాలిన్ సోమవారం కావేరి జలాల సమస్యపై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన సీఎం విజయ్ కు వున్న ఒకే ఒక్క టెన్షన్ అని అనగానే... డీఎంకే కార్యకర్తలు పెద్దఎత్తున త్రిష.. త్రిష అంటూ నినాదాలు చేసారు. ఈ నినాదాలతో కొద్దిసేపు సభ అంతా మారుమోగింది. ఇదిలావుంటే మధురై అసెంబ్లీ స్థానం నుంచి విజయ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ స్థానం నుంచి త్రిష పోటీ చేయాలంటూ పెద్దఎత్తున త్రిష అభిమానులు హంగామా చేస్తున్నారు. మరోవైపు డీఎంకె కార్యకర్తలు సైతం త్రిషకు మంచి హైప్ ఇస్తున్నట్లున్నారు. ఎక్కడికెళ్లినా త్రిష అంటూ నినాదాలు చేస్తుండటంతో సౌతిండియన్ స్లిమ్ స్టార్ త్రిషకు పొలిటికల్ మైలేజీ బాగా దొరుకుతున్నట్లవుతోంది.