1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
  4. Today 07-06-2026 Daily Astrology

07-06-22 ఆదివారం ఫలితాలు - సంకల్ప బలంతోనే కార్యం సిద్ధిస్తుంది

Daily Astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
సంకల్ప బలంతోనే కార్యం సిద్ధిస్తుంది. మీ సామర్థ్యాలపై నమ్మకం పెంచుకోండి. పరిచయస్తులు ధనసహాయం అర్థిస్తారు. పనులకు కృషి ప్రధానం. ప్రముఖుల సందర్శనం కోసం పడిగాపులు తప్పవు సన్మాన సంస్కరణ సభల్లో పాల్గొంటారు. 
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
మీదైన రంగంలో రాణిస్తారు. లావాదేవీలు ఫలిస్తాయి. సముచిత నిర్ణయం తీసుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. అవసరాలు: తీరుతాయి. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, అర్థ, పునర్వసు 1, 2, 3 పాదాలు
సంకల్పం సిద్ధిస్తుంది. ధనలాధం. వాహనసౌఖ్యం ఉన్నాయి. మాటతీరుతో ఆకట్టుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. విలాసాలకు వ్యయం చేస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. ఏకాగ్రతతో వాహనం నడపండి. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
అన్ని విధాలా కలిసివచ్చే సమయం, ప్రతికూలతలను ధీటుగా ఎదుర్కుంటారు. కష్టమనుకున్న పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. ఖర్చులు అధికం. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పెద్దలను సంప్రదిస్తారు. మీ అభిప్రాయాలను స్పందన లభిస్తుంది. 
 
సింహం మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆశావహదృక్పథంతో సన్నాహాలు సాగిస్తారు. సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఆదాయానికి లోటుండదు. కీలక వ్యవహారంలో ఏకాగ్రత వహించండి. ఏకపక్ష నిర్ణయాలు తగవు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. పనులు మందకొడిగా సాగుతాయి. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు.
ప్రతికూలతలు అధికం. శ్రమించినా ఫలితం అంతంతమాత్రమే. మీ సామర్థ్యంపై నమ్మకం తగ్గుతుంది. ఆశావహదృక్పథంతో మెలగండి. అతిగా ఆలోచించవద్దు. దుబారా ఖర్చులు విపరీతం. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
లక్ష్య సాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కష్టం ఫలిస్తుంది. ఆప్తులకు మీ సమస్యలను తెలియజేయండి. దంపతుల మధ్య సఖ్యత లోపం సౌమ్యంగా మెలగండి. ఖర్చులు అదుపులో ఉండవు. ఒక సమాచారం ఉత్తేజపరుస్తుంది. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. ఇంటా బయటా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అనుకోని సంఘటన ఎదురవుతుంది. పసులు మందుకు సాగవు. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం:
కార్యక్రమాలు విజయవంతమవుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మొండి బాకీలు వసూలవుతాయి. ఖర్చులు అధికం. ప్రముఖులకు సన్నిహితులవుతారు. కొత్తయత్నాలు చేపడతారు. మాటతీరు అదుపులో ఉంచుకోండి. ఎవరినీ తక్కువ అంచనా వేయవద్దు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
వ్యవహార ఒప్పందాల్లో అప్రమత్తంగా ఉండాలి. అనాలోచిత నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. మీ సమస్యలను సన్నిహితులకు తెలియజేయండి. ధన సమస్య ఎదురవుతుంది. అవసరాలు నెరవేరవు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఆత్మీయులతో సంభాషిస్తారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాధ్ర 1, 2, 3 పాదాలు
ధైర్యంగా అడుగు ముందుకేయండి. సాయం ఆశించవద్దు. శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది. పనులు ఒక పట్టాన పూర్తికావు. చిన్న విషయానికి చికాకుపడతారు. మాటతీరు అదుపులో ఉంచుకోండి. వాహనం ఇతరులకివ్వవద్దు.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. మరింత బాధ్యతగా వ్యవహరించాలి. ఇతరుల కోసం. విపరీతంగా వ్యయం చేస్తారు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. అజ్ఞాతవ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది. ఆప్తుల రాక ఉత్సాహాన్నిస్తుంది.
About Writer
పి.ప్రసూనా రామన్
తర్వాతి కథనం
07-06-2026 నుంచి 13-06-2026 వరకు ఫలితాలు - అన్ని విధాలా యోగదాయకమే