1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
  4. Today 30-07-2026 Daily Astrology

30-07-2026 గురువారం ఫలితాలు.. ఏ పనీ చేయబుద్ధి కాదు

Daily Astrology
Daily Astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
తలపెట్టిన కార్యం సిద్ధిస్తుంది. ప్రముఖలకు చేరువవుతారు. ఆర్భాటాలకు ఖర్చుచేస్తారు. పనులు, బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. ఆత్మీయులతో సంభాషిస్తారు. పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. ప్రైవేట్ ఫైనాన్సుల జోలికి పోవద్దు. సన్నిహితుల సలహా పాటించండి. కొత్త పనులు చేపడతారు. వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. అనాలోచిత నిర్ణయాలు తగవు. తొందరపడి హామీలివ్వవద్దు. వాహనం కొనుగోలు చేస్తారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
అన్నివిధాలా బాగుంటుంది. చిత్తశుద్ధిని చాటుకుంటారు. వ్యాపకాలు అధికమవుతాయి. కొత్త పనులు చేపడతారు. ధనసహాయం తగదు. మీ అభిప్రాయాలను సున్నితంగా తెలియజేయండి. పరిచయం లేని వారితో జాగ్రత్త. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
విశేష ఫలితాలున్నాయి. లక్ష్యం సాధిస్తారు. ప్రశాంతత నెలకొంటుంది. ఏ పనీ చేయబుద్ధి కాదు. ఉల్లాసంగా గడుపుతారు. ఖర్చులు సామాన్యం. చెల్లింపుల్లో జాప్యం తగదు. నోటీసులు అందుకుంటారు. నిపుణులను సంప్రదిస్తారు. ఏకాగ్రతతో వాహనం నడపండి. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
గ్రహస్థితి బాగుంది. ఉత్సాహంగా యత్నాలు సాగిస్తారు. సన్నిహితుల ప్రోత్సాహం ఉంది. పనులు ఇతరులకు అప్పగించవద్దు. అకారణంగా మాటపడవలసి వస్తుంది. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ప్రతికూలతలు అధికం. శ్రమించినా ఫలితం ఉండదు. మీ కష్టం మరొకరికి కలిసివస్తుంది. నిస్తేజానికి గురవుతారు. ఓర్పుతో మెలగండి. ఖర్చులు తగ్గించుకుంటారు. సన్నిహితులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
నిర్విరామంగా శ్రమిస్తారు. కష్టం ఫలిస్తుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. వ్యవహారాలు వాయిదా వేయటం శ్రేయస్కరం. అనుభవజ్ఞులను సంప్రదించండి. పనులు త్వరితగతిన సాగుతాయి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. దూరప్రయాణం వాయిదా వేసుకుంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
సంకల్పసిద్ధితో యత్నం సాగించండి. ఓర్పుతో శ్రమిస్తేనే కారు సాధ్యమవుతుంది. మీ సామర్థ్యాలపై నమ్మకం పెంచుకోండి. అవకాశం చేజారినా నిరుత్సాహపడవద్దు. లక్ష్యానికి చేరువలో ఉన్నారు. అప్రమత్తంగా ఉండాలి. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
తలపెట్టిన కార్యం సఫలమవుతుంది. అనుకున్నది సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ఖర్చులు తగ్గించుకుంటారు. వ్యాపకాలు అధికమవుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. దైవకార్యంలో పాల్గొంటారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. అప్రియమైన వార్త వింటారు. పనులు ముందుకు సాగవు. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఆత్మీయులను సంప్రదిస్తారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
గ్రహస్థితి అనుకూలంగా ఉంది. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలేసుకుంటారు. ఊహలు, అంచనాలు ఫలిస్తాయి. సన్నిహితులకు సాయం అందిస్తారు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
దృఢసంకల్పంతో ముందుకు సాగండి. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. ఏ విషయాన్ని పట్టించుకోవద్దు. రావలసిన ధనాన్ని లౌక్యంగా రాబట్టుకోవాలి. ఖర్చులు అధికం. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురైనా పూర్తిచేస్తారు. ఏకాగ్రతతో వాహనం నడపండి.
About Writer
పి.ప్రసూనా రామన్
తర్వాతి కథనం
TTD: శ్రీవారి సేవ వాలంటీర్ల కోసం సిబిల్ స్కోర్ తరహా రేటింగ్.. ఈవో