1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
  4. Detoxify the body with this immunity, energy-boosting jaggery drink

బెల్లం నీటితో మార్నింగ్ కిక్‌స్టార్ట్ చేస్తే?

Jaggery Lemon juice
ఆరోగ్యకరమైన, శక్తినిచ్చే రిఫ్రెష్ డ్రింక్స్‌ బెల్లం నీటితో మార్నింగ్ కిక్‌స్టార్ట్ చేయడం మంచిది. బెల్లం నీటితో రోజును ప్రారంభిస్తే.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూర్చిన వారవుతాం. బెల్లంతో కూలింగ్ టీని సిప్ చేస్తే ఆరోగ్యంగా వుండవచ్చు. ఇందుకు నిమ్మరసాన్ని జోడిస్తే బరువు తగ్గిపోతారు. 
 
ఆయుర్వేదం ప్రకారం, గోరువెచ్చని నీరు, బెల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇది సహజమైన జీర్ణ ఎంజైమ్‌లను పెంచుతుంది, జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. కిడ్నీ సంబంధిత వ్యాధులకు కూడా సహాయపడుతుంది.
 
కాలానుగుణంగా వచ్చే జలుబు, దగ్గు, ఫ్లూను తగ్గిస్తుంది. ఇందులో అనేక ఫినోలిక్ సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడితో పోరాడుతాయి. ఇది శరీరాన్ని రిలాక్స్ చేస్తాయి. ఇది ఇన్ఫెక్షన్‌లకు వ్యతిరేకంగా నిరోధకతను పెంచడంలో సహాయపడుతుంది. శ్వాసకోశ నాళాలు, ఊపిరితిత్తులు, ఆహార పైపులు, కడుపు, ప్రేగులను కూడా శుభ్రపరుస్తుంది.
 
 బెల్లం నీటిలో జింక్, ఐరన్, ఫాస్పరస్, సెలీనియం, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్లు B1, B6 విటమిన్ సి వంటి యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలతో నిండి ఉంది. ఇందులోని ఫైబర్.. టాక్సిన్స్‌ను తొలగిస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
కొవ్వు కరిగించే వాటర్ ఫాస్టింగ్, ఎలా చేయాలి?