మధుమేహానికి చెక్ పెట్టే మామిడి పువ్వులు.. ఎలాగంటే..?
Mango Flowers
ఎండిన మామిడి పువ్వులను ధూపంలో వేస్తే దోమలువుండవు. మామిడి పువ్వులు, జీలకర్రను సమభాగంలో తీసుకుని.. ఎండిన తర్వాత పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్‌ను రోజూ అర స్పూన్ మేర తీసుకుంటే.. మూల వ్యాధి నయం అవుతుంది. వేడితో ఏర్పడే ఉదర రుగ్మతలను కూడా మామిడి పువ్వులు నయం చేస్తాయి. ఎండబెట్టిన మామిడి పువ్వులను బాగా పొడి చేసుకుని మజ్జిగలో కలిపి తీసుకుంటే నోటిపూత ఏర్పడదు.
ముఖ్యంగా మామిడి పువ్వులు డయాబెటిస్ పేషెంట్లకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. మామిడి పువ్వులు, నేరేడు గింజలను సమానంగా తీసుకుని ఎండబెట్టి పొడి చేసుకోవాలి. రోజూ ఈ మిశ్రమాన్ని ఓ స్పూన్ పరగడుపున వేడినీటితో తీసుకుంటే మంచి ఫలితం వుంటుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
