రోడ్డు డివైడర్ వద్ద ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న మోటార్ సైకిల్.. ఇద్దరు మృతి
Road Accident
శుక్రవారం అర్ధరాత్రి మునాజిర్ తన యమహా ఎఫ్.జెడ్ మోటార్ సైకిల్‌పై నాగారం వైపు వెళ్తుండగా, వాహనంపై నియంత్రణ కోల్పోయి శ్రీ పూజా గ్లాస్ హార్డ్‌వేర్ దుకాణం ఎదురుగా ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టాడు.
ఈ ప్రమాదంలో మోటార్ సైకిల్ నడుపుతున్న మునాజిర్, వెనుక కూర్చున్న సలావుద్దీన్ ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

