1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Arundhati Nakshatram been launched in a grand manner As a Aadi Saikumar

Aadi Sai kumar: ఆది సాయికుమార్ నటిస్తున్న అరుంధతి నక్షత్రం ఘనంగా ప్రారంభం

Aadi Saikumar, Megha Shetty, Madhu Damaraju, Sai Kumar, and others
Aadi Saikumar, Megha Shetty, Madhu Damaraju, Sai Kumar, and others
ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా అరుంధతి నక్షత్రం. మేఘ శెట్టి, మధు దామరాజు హీరోయిన్స్.. ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న నిర్మాణ సంస్థ 7 పి.ఎం. ప్రొడక్షన్స్, శ్రీ చక్ర మూవీస్ ఎల్ఎల్ పి బ్యానర్స్ ఈ  సినిమాను నిర్మిస్తున్నాయి. దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ రూరల్ ఫ్యామిలీ డ్రామా కథతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని సందీప్ అగరం, అష్మిత రెడ్డి బాసాని, డా.సూర్యకాంతి కూచిభొట్ల నిర్మిస్తున్నారు.
 
ఈ రోజు హైదరాబాద్ లో  "అరుంధతి నక్షత్రం" సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి యాక్టర్ సాయి కుమార్ క్లాప్ ఇచ్చారు. ప్రొడ్యూసర్స్ రమేష్ పుప్పాల, సూర్యకాంతి కూచిభొట్ల కెమెరా స్విచ్ఛాన్ చేశారు. చిత్ర నిర్మాతలు స్క్రిప్ట్ అందించారు. "అరుంధతి నక్షత్రం" ఆది సాయికుమార్ 28వ సినిమాగా రాబోతోంది.
 
 సినిమా అనౌన్స్ మెంట్ సందర్బంగా మేకర్స్ స్పెషల్ వీడియో గ్లింప్స్ రిలీజ్ చేశారు. ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమాను గుర్తుచేసేలా మెమొరీ కార్డ్ లోని ఫొటోస్ ను పోస్టర్స్ గా ప్రింట్ చేసి "అరుంధతి నక్షత్రం" సినిమా రూపొందిస్తున్నట్లు తెలియజేశారు. ఈ అనౌన్స్ మెంట్ వీడియో ద్వారా ఇది ఒక మంచి రూరల్ ఫ్యామిలీ డ్రామా అని అర్థమవుతోంది. ఈ నెలలోనే "అరుంధతి నక్షత్రం" సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించబోతున్నామని, తమ బ్యానర్ కు మరింత పేరు తెచ్చేలా ఈ సినిమా ఉంటుందని  ప్రొడ్యూసర్స్ తెలిపారు.
 
టెక్నీషియన్స్
---------------------------
సౌండ్ డిజైనర్ - అశ్విన్ రాజశేఖర్
కాస్ట్యూమ్ డిజైనర్ - ఆర్తి విన్నకోట, ప్రియాంక వీరబోయిన
లిరిక్స్ - సనరే
ఎడిటర్ - నరేష్ అడుపా
డీవోపీ - ఫహాద్ అబ్దుల్ మజీద్
ప్రొడక్షన్ డిజైనర్ - ప్రియ నాయర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - ప్రజ్నయ్ కోనిగరి
మ్యూజిక్ - సురేష్ బొబ్బిలి
బ్యానర్స్ - 7 పి.ఎం. ప్రొడక్షన్స్, శ్రీ చక్ర మూవీస్ ఎల్ఎల్ పి
ప్రొడ్యూసర్స్ - సదీప్ అగరం, అష్మిత రెడ్డి బాసాని, డా.సూర్యకాంతి కూచిభొట్ల
స్క్రిప్ట్, డైరెక్షన్ - రాహుల్ శ్రీనివాస్
డిజిటల్ - కనెక్ట్ డిజిటల్
పీఆర్ఓ - గాండ్ల శ్రీనివాస్
About Writer
దేవీ
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
Nani party :విడుదలకు ముందే అలియాస్ రుక్మిణి టీమ్ బ్లాక్ బస్టర్ పార్టీ. చేసుకుంది