టేకాఫ్ అయిన ఐదు నిమిషాలకే సాంకేతిక లోపం.. ల్యాండింగ్.. ప్రయాణీకులు సేఫ్
శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం, సాంకేతిక లోపం కారణంగా అత్యవసరంగా తిరిగి ల్యాండ్ అయింది. సమాచారం ప్రకారం, విమానం బయలుదేరిన ఐదు నిమిషాలకే సాంకేతిక సమస్యను గుర్తించిన పైలట్, విమానాన్ని తిరిగి విమానాశ్రయానికి మళ్లించారు.
ఈ లోపం గురించి పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)కి సమాచారం అందించారు. టేకాఫ్ అయిన ఐదు నిమిషాలకే సాంకేతిక సమస్య తలెత్తడంతో పైలట్ అప్రమత్తమయ్యారు.
దీంతో విమానంలో ఉన్న 109 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విమానం ల్యాండ్ అయిన తర్వాత ఇంజినీరింగ్, సాంకేతిక బృందాలు దాన్ని పరిశీలిస్తున్నాయి.

