1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Madhya Pradesh : Wants To Kill Me : Wife Says No To Karwa Chauth Fast, Man Files Complaint

కర్వా చౌత్ వ్రతం చేయలేదని ఆగ్రహం - భార్యపై భర్త ఫిర్యాదు

couple
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ విచిత్రమైన కేసు ఒకటి నమోదైంది. రాష్ట్రంలోని కర్వా చౌత్ పండుగ సందర్భంగా భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. తన కోసం భార్య కర్వా చౌత్ వ్రతం చేయలేదని, చంద్రుడికి పూజ కూడా చేయలేదని ఆరోపిస్తూ ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతేకాదు.. ఈ సారి కూడా పూజ చేయకపోతే విడాకులు ఇస్తానంటూ భార్యను బెదిరించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నాడు. 
 
శివపురి జిల్లా బిజ్రావన్ గ్రామానికి చెందిన బరేలాల్ ఆదివాసీ తన భార్య మిథిలేశ్ ఆదివాసీపై బదర్వాస్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. భార్య తనకు నమ్మకంగా ఉడంటం లేదని తన కోసం ఉపవాసం ఉండటానికి నిరాకరించిందని ఆరోపించారు. కర్వా చౌత్ సందర్భంగా చంద్రుడిని చూపి తన దీర్ఘాయుష్షు కోసం ప్రార్థించాలని కోరినా ఆమె పట్టించుకోలేదని ఫిర్యాదులో రాశాడు. అంతేకాకుండా, భార్య తనను చంపాలని చూస్తోందని కూడా ఆరోపించాడు. 
 
ఈ ఫిర్యాదుపై స్పందించిన కోలారస్ సబ్ డివిజినల్ పోలీస్ అధికారి సంజయ్ మిశ్రా.. మహిళా పోలీస్ అధికారి సహాయంతో దంపతులకు కౌన్సిలింగ్ నిర్వహించి, వారి మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
దక్షిణ అండమాన్‌లో మరో అల్పపీడనం - ఏపీ వైపు దూసుకొస్తోంది...