కోతి తలపై రూ.51 వేల రివార్డు.. చివరకు అలా చిక్కింది?
కోతి చేష్టలు మామూలుగా వుండవు కదా. వీటి చేష్టలను ప్రతి ఒక్కరూ చేసేవుంటారు. అయితే, ఓ ఏకంగా 30 మందిని కరిచి పట్టణ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. దీంతో దాన్ని ప్రాణాలతో పట్టుకునేందుకు రూ.51 వేల రివార్డును మున్సిపల్ చైర్మెన్ ప్రకటించారు. ఈ విచిత్ర సంఘటన హర్యానా రాష్ట్రంలోని పల్వర్ జిల్లా హథీన్ పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
కోతిని పట్టుకున్న వ్యక్తి దాని చేతులు కట్టేసి భుజాలపై మోస్తూ బుధవారం పట్టణ వీధుల్లోకి వచ్చారు. ఇంకేముంది.. ఆ వింత కోతి ఊరేగింపును చూసేందుకు జనం వెనుక నడిచారు. అయితే, కొందరు కర్రలు తీసుకుని కోతిపై దాడికి యత్నించారు. దీన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
కోతుల అల్లరి హర్యానాకే పరిమితం కాలేదు. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఉంది. అనేక కోతులు పలు ఇళ్లలోకి చొరబడటం, ఆహార పదార్థాలను ఎత్తుకెళ్లడం, దుకాణాల్లో వస్తువులు చిందరవందర చేయడం, కొన్నిసార్లు మనుషులపై దాడులకు దిగడం వంటి ఘటనలు తరచూ కనిపిస్తుంటాయి. కొన్ని చోట్ల గుంపులుగా వచ్చి ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి.

