తల్లిదండ్రులు చంపాలని చూస్తే... చెట్టు కొమ్మను పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్న బాలిక
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్లో దారుణ ఘటన ఒకటి వెలుగు చూసింది. కన్న కూతురిని చంపేదుకు ఓ తండ్రి సవతి తల్లి కలిసి గంగా కాలువలో తోసేశారు. అయితే, గస్తీలో ఉన్న పోలీసులు సమయర్ఫూర్తితో వ్యవహరించి 15 యేళ్ల ఆ బాలిక ప్రాణాలు కాపాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు.
ఈ నెల 27వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో భోపా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. రాత్రిపూట గస్తీ నిర్వహిస్తున్న పోలీస్ బృందానికి బచావో.. బచావో (కాపాడండి) అంటూ కేకలు వినిపింయాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కాలువ వైపు చూడగా, ఓ బాలిక నీటి ప్రవాహంలో కొట్టుకునిపోతూ, ఓ చెట్టు కొమ్మను పట్టుకుని ప్రాణాల కోసం పోరాడుతోంది. ఆ బాలికను చూసిన పోలీసులు సమయస్ఫూర్తితో వ్యవవహరించి ఆ బాలికను రక్షించారు.
ఆ తర్వాత ఆ బాలికకు ప్రాథమిక చికిత్స అందించి పోలీసులు ఆరా తీశారు. తన తండ్రి ఫైసల్, సవతి తల్లి సాయీ హసీన్ తనను చంపాలనే ఉద్దేశ్యంతోనే గంగా కాలువలోకి తోసేశారని చెప్పాడు. పైగా ఇంటి పట్టున ఉంటే తరచూ కొట్టేవారని తెలిపారు.
బాధితురాలని రుడక్లీ గ్రామ వాసిగా గుర్తించారు. నిందితుడైన తండ్రి ఫైసల్ ఒక హిస్టరీ షీటర్ అని పోలీసులు తెలిపారు. ఫైసల్, అతడి రెండో భార్య సాయీ హసీన్ కలిసి ఈ హత్యాయత్నానికి పాల్పడినట్టు తేలింది. దీంతో వారిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులను లోతుగా వివారిస్తున్నార.

