1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. CJP leaders Saurav Das, Ashutosh Ranka summoned by Delhi Police Crime Branch after release from jail

జైలు నుంచి విడుదలైన కాక్రోచ్ పార్టీ నేతలు - ఆ వెంటనే పోలీస్ నోటీసులు

cjp leaders
కాక్రోచ్ జనతా పార్టీ నేతలు తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ఆ వెంటనే పోలీసులు వారికి నోటీసులు ఇచ్చారు. ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్, కన్నాట్ ప్లేస్ తదితర ప్రాంతాల్లో పోలీసుల అనుమతి లేకుండా ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు జరిపిన విషయం తెల్సిందే. ముఖ్యంగా నిషేధాజ్ఞలు అమల్లో ఉన్న రామ్ లీలా మైదానంలో పోలీసుల బ్యారికేడ్లను దాటుకుని కాక్రోచ్ జనతా పార్టీ నేతలైన సౌరభ్ దాస్, అశుతోష్ రంకా, అజింక్య షిండేలు ప్రవేశించారు. దీంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేసి జ్యూడీషియల్ కస్టడీకి పంపించారు. 
 
ఈ నేపథ్యంలో సీజేపీ నేతలను ఢిల్లీ స్పెషల్ మేజిస్ట్రేట్ కోర్టు బుధవారం రాత్రి విడుదల చేసింది. దీంతో గురువారం ఆ ముగ్గురు నేతలు తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ఆ వెంటనే ఢిల్లీ పోలీసులు వారికి నోటీసులు జారీచేశారు. కేసు విచారణకు మరోమారు హాజరుకావాలని అందులో పేర్కొన్నారు. 
 
కాగా, ఏడు రోజుల పాటు కస్టడీలో ఉన్న కాక్రోచ్ జనతా పార్టీ నేతలు... జంతర్ మంతర్‌ను నిరసన ప్రదర్శనల ప్రదేశంగా ఉండగా, దీన్ని పోలీసులు తొలగించారు. దీంతో తిరిగి ఆ ప్రాంతాన్ని నిరసన ప్రదేశంగా గుర్తించే వరకు అక్కడ నిరసనలు చేపట్టబోమని వారు లిఖితపూర్వకంగా హామీ ఇచ్చిన విషయం తెల్సిందే. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
ధృతరాష్ట్ర కౌగిలి అంటే ఇలాంటిదేనేమో? భార్య ఎముకలు విరిగేటట్లు కౌగలించుకున్న భర్త, వీడియో