RC 17 Getup: రామ్ చరణ్ ను సుకుమార్ శ్రీకృష్ణుడి ఇతివృత్తంతో చూపించబోతున్నాడు !
RC 17 Script - Ramchan getup
ఒక నెమలి ఈకను పోస్టర్ లో హైలైట్ చేశారు సుకుమార్. ఆ నెమలి పింఛం మధ్యలో రామ్ చరణ్ ముఖం కనిపీ కనిపించకుండా చాలా ఆర్టిస్టిక్ గా డిజైన్ చేశారు. ఈ పోస్టర్ చూసిన వెంటనే అందరికీ శ్రీకృష్ణుడి ఇతివృత్తం గుర్తుకు వస్తోంది. సినిమా కథకు, శ్రీకృష్ణుడి తత్వానికి ఏదైనా బలమైన లింక్ ఉందా అనే చర్చ మొదలైంది. పైగా ఈ ప్రాజెక్ట్ కోసం రామ్ చరణ్ గత కొంత కాలంగా తన జుట్టు పెంచుతూ సరికొత్త మేకోవర్ లోకి మారుతున్నాడు. ఆ లాంగ్ హెయిర్ లుక్ ని ఈ నెమలి ఈక కాన్సెప్ట్ కు సింక్ చేస్తూ సుకుమార్ ఏదో పెద్ద ప్లాన్ గీశాడని స్పష్టంగా అర్థమవుతోంది.
ముఖ్యంగా రామ్ చరణ్ తన సోషల్ మీడియాలో #UCanImagine అనే ట్యాగ్ లైన్ వాడటంతో ఫ్యాన్స్ తమ ఊహాశక్తికి పదును పెడుతున్నారు. కొంతమంది నెటిజన్స్ ఇది కచ్చితంగా ఒక స్వచ్ఛమైన ప్రేమకథ అయి ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరికొందరు మాత్రం ఇది ఒక పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో సాగే మోడ్రన్ రొమాంటిక్ డ్రామా అని విశ్లేషిస్తున్నారు. ఇంకొక అడుగు ముందుకేసి, ఇందులో కచ్చితంగా దైవాంశ సంభూతుడికి సంబంధించిన మైథలాజికల్ టచ్ ఉంటుందని, అందుకే ఆ నెమలి ఈకను ఒక సింబాలిక్ రిఫరెన్స్ గా వాడారని గట్టిగా వాదిస్తున్నారు. సుకుమార్ ఎప్పుడూ తన పోస్టర్స్ లో కథకు సంబంధించిన చాలా పెద్ద హింట్ దాచిపెడతాడు కాబట్టి, ఈ నెమలి ఈక వెనుక కచ్చితంగా హీరో క్యారెక్టరైజేషన్ కు సంబంధించిన ఒక బలమైన లాజిక్ దాగి ఉందనే చర్చ బాగా జరుగుతుంది.
మ్యూజిక్ అనిరుధ్ రవిచందర్ ఎంట్రీ అంచనాలు డబుల్ అయ్యాయి. వీళ్ల ముగ్గురూ కలిసి పనిచేయడం ఇదే తొలిసారి. సుకుమార్ విజువల్స్ కి అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తోడైతే థియేటర్లలో నెక్స్ట్ లెవెల్ ఎక్స్ పీరియన్స్ గ్యారెంటీ అని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను ఎక్కడా రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. చరణ్ కు ఉన్న గ్లోబల్ ఇమేజ్ దృష్ట్యా ఈ ప్రాజెక్ట్ స్పాన్ కు ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఒక పక్క క్లాసిక్ టచ్ ఇస్తూనే మరోపక్క భారీ స్కేల్ లో విజువల్ వండర్ గా ఈ మూవీని మలచబోతున్నారని టాక్ వినిపిస్తోంది.
అసలు ఆ నెమలి పింఛం వెనుక ఉన్న అసలు మిస్టరీ ఏమిటి, చరణ్ ప్లే చేయబోయే క్యారెక్టర్ ఎలాంటిది అనే విషయాలపై మరింత క్లారిటీ రావాలంటే మేకర్స్ నుంచి మరో అప్డేట్ వచ్చే వరకు వెయిట్ చేయక తప్పదు. సంక్రాంతి తర్వాత సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.

