Borabanda: ఐదేళ్ల బాలుడిని హత్య చేసిన తండ్రి.. కారణం ఏంటి?
తెలంగాణ, హైదరాబాద్, బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని శిల్పానగర్లో ఐదేళ్ల బాలుడు తన తండ్రి చేతిలో హత్యకు గురయ్యాడు. బాలుడి తల్లి ఒక క్యాటరింగ్ పని నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది.
ఉదయం ఆమె తిరిగి ఇంటికి వచ్చేసరికి, తన కుమారుడు మరణించి ఉండటాన్ని గమనించింది. ఘటన గురించి సమాచారం అందుకున్న బోరబండ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, బాలుడి మరణానికి దారితీసిన పరిస్థితులు, ఈ నేరానికి గల కారణాలను తెలుసుకోవడానికి దర్యాప్తు చేపట్టారు.

