1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. Monkeys Chase Two Boys, One Dies After Falling in Suryapet

వెంబడించిన కోతుల గుంపు.. కిందపడిన 12 ఏళ్ల బాలుడు మృతి

monkey scare
కోతుల గుంపు వెంబడించడంతో ఓ బాలుడి గుండె ఆగిపోయింది. సూర్యాపేట జిల్లా, నాడిగూడెం మండలం వల్లపురంలో కోతుల గుంపు నుంచి తప్పించుకునే క్రమంలో పడిపోయిన 12 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. వల్లపురానికి చెందిన వీరబాబు కుమారుడు నిశాంత్, దేశగాని సతీష్ కుమారుడు మనేందర్ సమీపంలోని చెరువు వద్దకు చేపలు పట్టడానికి వెళ్లారు. తిరిగి ఇంటికి వస్తుండగా, కోతుల గుంపు వారిని సమీపించడంతో బాలురు భయాందోళనకు గురయ్యారు.
 
కోతుల నుంచి తప్పించుకోవడానికి వారు పరిగెత్తగా, నిశాంత్ కింద పడిపోయాడు. మనేందర్ గట్టిగా కేకలు వేయడంతో కోతులు అక్కడి నుంచి వెళ్లిపోయాయి. అటుగా వెళ్తున్న ఇద్దరు యువకులు నిశాంత్‌ను గమనించి, గ్రామ ఆసుపత్రికి తరలించారు. 
 
అక్కడ వైద్య సదుపాయాలు లేకపోవడంతో, వారు 108 అంబులెన్స్ సేవలకు సమాచారం అందించారు. అంబులెన్స్ సిబ్బంది నిశాంత్‌ను పరీక్షించి, అప్పటికే అతను మరణించినట్లు ధృవీకరించారు.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
బ్లాక్ కవరులో రూ. 1.56 కోట్ల విలువైన విదేశీ కరెన్సీ.. ఎలా పట్టుకున్నారంటే?