1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
  4. which type of bath best for romance, cold bath or heat bath?

శృంగారం సూపర్... వేడి నీళ్ళ స్నానమా? చన్నీటి స్నానమా?

bath
స్త్రీ, పురుషుల్లో కామోద్రేకం పొందడం, స్తంభనలు కలగడమనేది మనసులో కలిగే కోరిక, హార్మోన్ల ప్రభావనాన్ని బట్టి ఉంటుంది. వేడినీళ్ళతో స్నానం చేసినంత మాత్రాన లేదా చన్నీటితో స్నానం చేసినంత మాత్రాన కోరికలు ఏ మాత్రం కలగవు. 
 
శృంగార కోరికలు శరీరానికి చేసే స్నానాలతో ముడిపడవు. అవి మనస్సు, ఆలోచనలను బట్టే ఉంటాయి. సాధారణంగా వారివారి శరీర తత్వం లేదా మొదటి నుండీ ఉన్న అలవాటును బట్టి వేడి లేదా చన్నీటి స్నానాలు చేస్తారు.
 
కాకపోతే చలికాలంలో దంపతులు వెచ్చదనం కోసం ఆరాటపడుతూ, కోరిక మూలంగా క్షణంలో ఉద్రేకం చెంది ఒకటవుతారు. అంతేకాని వేడి నీళ్లో, లేక చన్నీళ్లో స్నానం చేయడం వల్ల కాదు. ఏదేమైనా శరీర శుభ్రత కోసం స్నానం చేయడం తప్పనిసరి.
తర్వాతి కథనం
టమోటా గుజ్జుతో అందం సొంతం... ఏం చేయాలంటే?