1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. man booked in hyderabad for harassing woman to marry before divorce

విడాకులు ఇంకా రాలేదబ్బా... వెయిట్ చేయ్యి పెళ్లి చేసుకుందామన్న మహిళ... వేధించిన వ్యక్తి - కేసు నమోదు

victim woman
తనకు ఇంకా విడాకులు మంజూరు కాలేదని, అందువల్ల వివాహం చేసుకునేందుకు మరికొంతకాలం ఆగాలంటూ ఓ వివాహిత తన ప్రియుడికి విన్నవించుకుంది. కానీ, ఆ ప్రియుడు మాత్రం పెళ్లి పేరుతో వేధించసాగాడు. ఈ వేధింపులను భరించలేని సదరు మహిళ పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు ఆ వ్యక్తిపై కేసు నమోదు చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్, బోడుప్పల్ ప్రాంతానికి చెందిన 28 యేళ్ళ వివాహితకు గతంలో వివాహమైంది. అయితే, వ్యక్తిగత కారణాల వల్ల ఆమె ప్రస్తుతం తన భర్తకు దూరంగా ఉంటోంది. దాదాపు యేడాది క్రితం పీర్జాదిగూడలోని ఒక జాతీయ బ్యాంకు సమీపంలో ఆమెకు శ్రీనివాస్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో వారిద్దరూ ఫోన్లలో మాట్లాడుకునేవారు. 
 
ఈ క్రమంలో శ్రీనివాస్ ఆమె ఇంటికి వెళ్లి తనను పెళ్లి చేసుకోవాలంటూ పదేపదే వేధించసాగాడు. అయితే, తనకు ఇంకా విడాకులు మంజూరు కాలేదని, అందువల్ల వివాహం చేసుకనేందుకు మరికొంతకాలం ఆగాలంటూ నచ్చజెప్పింది. అయితే, శ్రీనివాస్ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా పదేపదే ఫోన్లు, మెసేజ్‌లు చేస్తూ విసిగించసాగాడు. వీటిని భరించలేని ఆ మహిళ... పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు కేసు సదరు వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించామని, నిందితుడిపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
మున్సిపల్ ఎన్నికల కార్యాలయం ఎదుట నిరసన.. వైకాపా చీఫ్ జగన్‌కు ఊరట