1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. Hyderabad ACB Arrests Surveyor, Tahsildar for Alleged Rs 20 Lakh Bribe

లంచం పుచ్చుకుంటూ పట్టుబడిన అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్, సర్వేయర్.. ఎంతంటే?

Tahsildar
Tahsildar
అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ లంచం పుచ్చుకుంటూ పట్టుబడ్డాడు. అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ బి. సుదర్శన్ రెడ్డి, మండల సర్వేయర్ బటుక శ్రీనివాసులు సోమవారం రూ. 20 లక్షల లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు వారిని అరెస్టు చేశారు. 
 
హెచ్ఎండీఏ మార్గదర్శకాల ప్రకారం ఒక లేఅవుట్‌కు సర్వే నిర్వహించి, ఉమ్మడి తనిఖీ సర్వే నివేదికను జారీ చేయడానికి సుదర్శన్ రెడ్డి ఈ లంచాన్ని డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీరిద్దరూ మొదట రూ. 23 లక్షలు డిమాండ్ చేసినప్పటికీ, చివరకు రూ. 20 లక్షలకు అంగీకరించారు. 
 
లంచం ఇవ్వాలని కోరిన వారి నుంచి ఫిర్యాదు అందుకున్న ఏసీబీ కేసు నమోదు చేసి, ఆపరేషన్ చేపట్టింది. శ్రీనివాసులు వద్ద ఉన్న లంచం డబ్బును స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ తెలిపింది. 
 
రసాయన పూత పూసిన (కెమికల్ మార్క్డ్) నోట్లు అతని వద్ద ఉన్నట్లు నిర్ధారణ అయింది. శ్రీనివాసులు, సుదర్శన్ రెడ్డిలను నాంపల్లిలోని ఎస్పీఈ, ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరిచినట్లు ఏసీబీ పేర్కొంది.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
అండమాన్ సముద్రంలో అల్పపీడనం .. 15 నుంచి తీరం వెంబడి వర్షాలు...