1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Bellamkonda Sai Sreenivas is set to appear in a fierce avatar in his fifth film.

Bellamkonda Sai : హైదవ చిత్రంతో ఉగ్రరూపధారిగా రాబోతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Bellamkonda Sai Srinivas teaser look
Bellamkonda Sai Srinivas teaser look
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సయుక్తా మీనన్, మహేష్ మంజ్రేకర్, సౌరభ్ సచ్దేవా, జెడి చక్రవర్తి ప్రధాన తారాగణంగా నటిస్తోన్న చిత్రం హైందవ.  లుధీర్ బైరెడ్డి దర్శకుడు. మూన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై మహేష్ చందు నిర్మిస్తున్నారు. ఆధ్యాత్మికత, హై-వోల్టేజ్ యాక్షన్ కలబోతతో ఈ పాన్-ఇండియా చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవల విడుదలైన పోస్టర్‌లో బెల్లంకొండ శ్రీనివాస్ చేతిలో గొడ్డలితో పవర్‌ఫుల్ లుక్‌లో కనిపించారు. తాజాగా టీజర్ ను విడుదలచేస్తున్నట్లు పోస్టర్ విడుదల చేశారు.
 
 సామ్ సి ఎస్ సంగీతం సమకూరుస్తున్న  ఈ చిత్రం ప్రతీకారానికి కొత్త చిరునామాగా రక్తపాతం సృష్టించేందుకు ‘హైందవ’ రెడీ అవుతున్నాడంటూ మేకర్స్ ఈ చిత్ర టీజర్ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. అక్టోబర్ 14న రిలీజ్ చేస్తున్నట్లే తెలిపారు. ఇక ఈ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో బెల్లంకొండ శ్రీనివాస్ అత్యంత ఉగ్రరూపంతో కనిపిస్తున్నాడు.
 
ఆమద్య విడుదలైన రాక్షసుడు సినిమాతో మంచి పేరుతెచ్చుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఆ తర్వాత వచ్చిన సినిమా ఆశించిన విజయాలు దక్కించుకోలేకపోయారు. కనుక మరలా ఆ తరహా ఫార్మెట్ లో హైందవ మతానికి సంబంధించిన పాయింట్ తో సక్సెస్ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు.
About Writer
దేవీ
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
Actress Sneha: అభిమానిని పాటకు మమేకంతో ముద్దు పెట్టుకున్న నటి స్నేహ