1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. 13 Killed, Including 4 Children & 4 Women In Road Crash In Jharkhand’s Ramgarh

ఆలయంలో పూజలు చేసేందుకు వెళుతూ తిరిగిరాని లోకాలకు.... జార్ఖండ్‌లో 13 మంది మృత్యువాత (Video)

jharkhand road accident
జార్ఖండ్ రాష్ట్రంలో ఘోరం జరిగింది. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసేందుకు వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏకంగా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఐదుగురు పురుషులు, నలుగురు చిన్నారులు, నలుగురు మహిళలు ఉన్నారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 
 
రాష్ట్రంలోని రామ్‍‌గఢ్ జిల్లాలో కొందరు భక్తులతో వెళుతున్న స్కార్పియో వాహనం ప్రమాదానికి గురైన ఘటనలో 13 మంది చనిపోయారు. రాంచీ - పాట్నా జాతీయ రహదారి 33పై కుజు పోలీస్ స్టేషన్‌లో పరిధిలో ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. బీహార్ రాష్ట్రంలోని నలందా జిల్లా జంఘారో గ్రామానికి చెందిన 114 మంది భక్తులు స్కార్పియో వాహనంలో రాజరప్ప ఆలయంలో పూజలు చేసేందుకు బయలుదేరారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. 
 
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. సమాచారం అందిన వెంటనే  అక్కడికి చేరుకున్న వాహనంలో చిక్కకున్న వారిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే 13 మంది చనిపోయినట్టు వైద్యులు ధృవీకరించారు. ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తిని రామ్‌గఢ్ సదర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
నవంబర్ 29, 2026, ఆదివారం నాడు వాతావరణం ఎలా వుందంటే?