1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Supreme Court's Strong Message After Rahul Gandhi's March

మార్చ్ ఫర్ డెమోక్రసీపై వివరణ ఇవ్వండి.. రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు ఆగ్రహం

rahul gandhi
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 12వ తేదీన మార్చ్ ఫర్ డెమోక్రసీ పేరుతో సుప్రీంకోర్టు వైపు రాహుల్ అధ్యక్షతన ర్యాలీ జరిగింది. దీనిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇండియా కూటమి నేతలతో కలిసి సుప్రీంకోర్టు వరకు రాహుల్ పాదయాత్రగా వెళ్లి, అక్కడక నిరసన చేపట్టారు. దీన్ని అపెక్స్ కోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ నిరసన ర్యాలీపై వివరణ ఇవ్వాల్సిందేనని ఆదేశించింది. ఇలాంటి చర్యల ద్వారా న్యాయవ్యవస్థను బెదిరించలేరని మందలించింది.
 
సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా డిమాండును మరింత బలంగా వినిపిస్తూ.. 'మార్చ్‌ ఫర్‌ డెమోక్రసీ' పేరిట సోమవారం ఇండియా కూటమి నేతలు సుప్రీంకోర్టు వరకు మార్చ్ చేపట్టారు. వీరికి మద్దతుగా వేలాది మంది కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం సర్‌ ప్రక్రియపై ఎన్నికల సంఘం పనితీరును ప్రశ్నిస్తూ సుప్రీంలో పిటిషన్ వేశారు. దీనిపై తాజాగా విచారణ జరిగింది. ఈ సందర్బంగా కేంద్రం, ఎన్నికల సంఘానికి న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది. అయితే, నోటీసులు ఇవ్వడమంటే.. రాజకీయ నాయకుల ప్రవర్తనను సమర్థించినట్లు కాదని ధర్మాసనం ఈ సందర్భంగా పేర్కొంది.
 
'రాజకీయ పాదయాత్రలు న్యాయస్థానం వరకు రావడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఇలాంటివి జరగకూడదు. న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు. ఇవన్నీ కోర్టుపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలే. ఇలాంటి బలహీన చర్యలను ఎవరూ పట్టించుకోరు' అని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. అలాగే పాదయాత్రకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ల విచారణలో భాగంగా రాహుల్ గాంధీ, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్‌కు నోటీసులు ఇచ్చింది. కోర్టు ప్రాంగణంలో నిరసనలకు సంబంధించిన రికార్డింగ్‌లను భద్రపర్చాలని పోలీసులను ఆదేశించింది. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
నాలోని రగ్గడ్ లుక్‌ను బయటికి తీసుకొచ్చే సమయం వచ్చింది.. కేటీఆర్ (video)