1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. Hyderabad: Woman arrested with 610 grams of ganja, Rs 3,300 cash

Hyderabad: ఓ మహిళ ఇంట్లో 610 గ్రాముల గంజాయి స్వాధీనం

ganja
ganja
హైదరాబాద్‌లో శుక్రవారం రాత్రి మంగారు బస్తీలో, ఒక మహిళ ఇంట్లో 610 గ్రాముల గంజాయి, రూ. 3,300 నగదును స్వాధీనం చేసుకున్న ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు, 50 ఏళ్ల మహిళను అరెస్టు చేశారు. తదుపరి చర్యల నిమిత్తం ఆమెను ధూల్‌పేట ఎక్సైజ్ స్టేషన్‌కు తరలించారు.

శుక్రవారం రాత్రి మంగారు బస్తీలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం ఒక మహిళను అరెస్టు చేసి, ఆమె వద్ద నుండి 610 గ్రాముల గంజాయిని, రూ. 3,300 నగదును స్వాధీనం చేసుకుంది.
 
ఇన్‌స్పెక్టర్ భరత్ భూషణ్ నేతృత్వంలోని బృందం సరళ (50) అనే మహిళ ఇంట్లో సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో 610 గ్రాముల గంజాయి, రూ. 3,300 నగదు లభ్యమయ్యాయి. స్వాధీనం చేసుకున్న గంజాయి, నగదుతో  తదుపరి చర్యల కోసం ధూల్‌పేట ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించారు. ప్రస్తుతం దీనిపై విచారణ కొనసాగుతోంది.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధాకృష్ణ తొలిసంతకం.. ఏ ఫైలు మీదో తెలుసా?