1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. Medchal: Youth Dies While Returning Home from Gym

జిమ్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి

road accident
జిమ్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ఓ యువకుడు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. శనివారం తెల్లవారుజామున నాగారం-రాంపల్లి కూడలి సమీపంలో గ్యాస్ ట్యాంకర్ లారీని తన మోటార్‌సైకిల్ ఢీకొట్టడంతో 20 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. మృతుడిని నాగారంలోని శివానందపురికి చెందిన బెన్నురి అఖిల్ గౌడ్‌గా గుర్తించారు. నాగారం నుండి అహ్మద్‌గూడ వైపు వెళ్తున్న గ్యాస్ ట్యాంకర్ లారీని సదరు యువకుడు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. 
 
ఈ ఘటన మేడ్చల్ జిల్లాలోని కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. జిమ్ ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
ఢిల్లీ వ్యాప్తంగా భద్రతా ఆంక్షలు.. అభిజీత్ నాయనమ్మ, సావిత్రిబాయి దీప్కే కన్నుమూత