1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. Toddler Dies After Falling from Second Floor in Vikarabad

రెండో అంతస్థు నుంచి కిందపడి 18 నెలల చిన్నారి మృతి

Baby
Baby
చిన్నారులు ఇంట్లో వుంటే ఎంతో జాగ్రత్తగా వుండాలి. నిర్లక్ష్యంతో వ్యవహరిస్తే.. ఇలాంటి ఘటనలే నిదర్శనం. వికారాబాద్ జిల్లా తాండూరులోని గాంధీనగర్‌లో, ఒక భవనం రెండో అంతస్తు నుండి ప్రమాదవశాత్తు కిందపడి 18 నెలల చిన్నారి మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. 
 
మృతురాలిని దీక్షితగా గుర్తించారు. భవనం పైనుంచి కిందపడటంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను చికిత్స కోసం హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఆమె మరణించింది. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
జనసేన పార్టీలోకి హైడ్రా కమిషనర్? ఏవీ రంగనాథ్ ఏమన్నారు?