సంబంధిత వార్తలు
- తెలుగు చిత్రపరిశ్రమపై కేంద్ర మంత్రి ప్రశంసలు.. బన్నీకి మద్దతుగా..
- కలెక్షన్లలో తగ్గేదేలే అంటున్న 'పుష్ప-2' మూవీ
- Venu Swamy: అల్లు అర్జున్‌కు మార్చి 29 వరకు టైమ్ బాగోలేదు (video)
- Jani Master: శ్రీతేజను పరామర్శించిన జానీ మాస్టర్.. ఇంత వరకే మాట్లాడగలను (video)
- రేవతి కుటుంబాన్ని ఆదుకోండి.. అల్లు అర్జున్‌కు ఈటెల విజ్ఞప్తి
రేవతి భర్తకు వేణుస్వామి ఆర్థిక సాయం.. అల్లు అర్జున్ జాతకంలో...
ప్రముఖ జ్యోతిష్యుడుగా గుర్తింపు పొందిన వేణుస్వామి ఓ మంచిపని చేశారు. 'పుష్ప-2' ప్రీమియర్ షో ప్రదర్శన సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన రేవతి అనే మహిళ భర్త భాస్కర్‌కు ఆయన తన వ్యక్తిగతంగా రూ.2 లక్షల ఆర్థిక సాయం చేశారు. అలాగే, మృతురాలి కుమారుడు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి అతని తండ్రి భాస్కర్‌ను అడిగి తెలుసుకుని, భాస్కర్‌కు రూ.2 లక్షల చెక్కును అందజేశాడు.
ఈ సందర్భంగా వేణుస్వామి మాట్లాడుతూ, శ్రీతేజ్ ఆరోగ్యం కోసం వారం రోజుల్లో మృత్యుంజయ హోమాన్ని తన సొంత ఖర్చులతో నిర్వహిస్తానని ప్రకటించారు. ప్రస్తుతం హీరో అల్లు అర్జున్ జాతకంలో శని ఉందని, అందుకే ఈ సంఘటన చోటుచేసుకుందన్నారు.
వచ్చే యేడాది మార్చి వరకు అల్లు అర్జున్ జాతకం ఇలానే ఉంటుందని చెప్పారు. ఆయన కొంచెం జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరి జీవితంలో తప్పొప్పులు సహజమన్నారు. ఎవరూ ఏదీ కావాలని చేయరని అన్నారు. అలాంటిదే సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన అని చెప్పారు.
